ఏలవయ్య లోకమెల్ల యిట్టెరాము దీవెనచే
నీలవర్ణ హనుమంతా నీవు మాకు రక్ష
మొదల నింద్రుడు నీ మోమునకెల్లా రక్ష
యిదెనీ శిరసునకు నినుడు రక్ష
కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష
చెదరని నీ మేనికెల్ల శ్రీ రామరక్ష
వడి నీ పాదములకు వాయుదేవుడు రక్ష
తొడలకు వరుణుండు తొడుగు రక్ష
విడువని మతికిని వేదరాసులే రక్ష
చెడని నీ యాయువునకు శ్రీ రామరక్ష
అంగపు నీ తేజమున కగ్నిదేవుడు రక్ష
శృంగరామునకెల్ల శ్రీసతి రక్ష
మంగాంబుధి హనుమంత నీకే కాలము
చెం గట శ్రీ వేంకటాద్రి శ్రీ రామరక్ష