ఇతడొకడే సర్వేశ్వరుడు
సితకమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||
పరమయోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము
సిరులొసగే ఈ శ్రీ వేంకటేశుడు ||
కలికి యశోదకు కన్నమాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అలద్రౌపదికిని ఆపద్భంధుడు
చెలరేగిన ఈ శ్రీవేంకటేశుడు ||
తగిలిన మునులకు తపముల సత్ఫలము
ముగురు వేల్పులకు మూలము
ఒగి నలమేల్మంగ కొనరినపతి యితడు
జిగిమించిన ఈ శ్రీవేంకటేశుడు ||