Thursday, November 21, 2024

అన్నమయ్య కీర్తనలు : పిడికిట

రాగం – శ్రీరాగం

ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత
పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు || పిడికిట ||

చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లికూతురు విభు
పేరుకుచ్చ సిగ్గుపడీ పెండ్లికూతురు || పిడికిట ||

చ|| బిరుదు పెండెము వెట్టె పెండ్లికూతురు నెర
బిరుదు మగని కంటె పెండ్లికూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురు పతి
పెరరేచీ నిదిలో పెండ్లికూతురు || పిడికిట ||

చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లికూతరు నేడె
పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు
గట్టిగ శ్రీ వేంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిదానమైన పెండ్లికూతురు || పిడికిట ||

Advertisement

తాజా వార్తలు

Advertisement