Monday, November 25, 2024

అన్నమయ్య కీర్తనలు : అంతరంగమెల్ల శ్రీహరికి

రాగం : హుసేని

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
వింత వింత విధముల వీడునా బంధములు || ||అంతరంగమెల్ల శ్రీహరికి||

మనుజుడై ఫలమేది మరి జ్ఞాని¸°దాకా
తనువె త్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
వనిమాలి ముదిసితే పాసెనా భవము || ||అంతరంగమెల్ల శ్రీహరికి||

చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాకా
మదిగలి ఫలమేది మాధవు దలచుదాకా
యెదుట తాను రాజైతే ఏలెనా పరము || ||అంతరంగమెల్ల శ్రీహరికి||

పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాక
భావించి తా దేవుడైతే ప్రత్యక్షమౌనా || ||అంతరంగమెల్ల శ్రీహరికి||

Advertisement

తాజా వార్తలు

Advertisement