Monday, November 25, 2024

అన్నమయ్య కీర్తనలు : ని ద్దిరించీ పాల జలనిధి

నిద్దిరించీ పాల జలనిధి వలెనే
వొద్దిక రమణునికి వొత్తరె పాదములు|| ||నిద్దిరించీ పాల జలనిధి||

వేగుదాక చిత్తగి ంచి విద్దె లెల్లనాదరించి
బాగుగా కృపారసము పంచి పంచి
యేగతి పవళించెనో యెట్ల భోగించెనో
యోగీంద్ర వరదుని నూచరె వుయ్యాలను|| ||నిద్దిరించీ పాల జలనిధి||

వాలుకన్నుల రెప్పల వడ దాకి తనుతావి
చాలుకొన్న నూర్పులు చల్లి చల్లి
నీలవర్ణపు గుణము నెరపుచునొకయింత
కాలము కన్నుల దిప్పీ కప ్పరే దోమతెర|| ||నిద్దిరించీ పాల జలనిధి||

సరగున యోగనిద్ర చాలించి లోకమెల్ల
కరుణించదలచి వేంకటగిరిపై
అరుదుగ సకల లోకారాధ్యుడాయె మించి
విరివినాల వట్టాలు విసరరే సతులు|| ||నిద్దిరించీ పాల జలనిధి||

Advertisement

తాజా వార్తలు

Advertisement