రాగం : సహన
నీటముంచు పాలముంచు
నీటముంచు పాలముంచు నీచిత్తమికను
చాటితి నీకృప గురి సంసారమునకు|| ||నీటముంచు పాలముంచు||
హరి నీవే గురి నాయాతుమ లోపలికి
అంది శంఖ చక్రాలే యంగపు గురి
పరమ పదమే గురి పట్టిన వ్రతమునకు
తిరుమంత్రమే గురి దిష్టపు నాలికకు|| ||నీటముంచు పాలముంచు||
గోవింద నీ పాద పూజే గురి నాదాస్యమునకు
తావుల నాభక్తికి నీదాసులే గురి
ఆవల నాకర్మమునకు ఆచార్యర్యుడే గురి
దేవ నీ శరణు దిష్టపునాజన్మానకు|| ||నీటముంచు పాలముంచు||
- Advertisement -
నగు శ్రీపతి గురి నన్ను రక్షించుటకును
తగు సం కీర్తన గురి తపమునకు
తెగని జ్ఞానమునకు తిరుమణులే గురి
మిగుల శ్రీ వేంకటేశ మించిన నీవే గురి|| ||నీటముంచు పాలముంచు||