Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : అడుగరె ఈ మాట

రాగం : బేగడ
అడుగరె ఈమాట అతని మీరందరును
యెడయని చోటను యిగిరించు బ్రియము|| ||అడుగరె ఈ మాట||

పొరపొచ్చ మగుచోట పొసగవు మాటలు
గరిమి నొరసితేను కలగు మతి
సరపులు లేనిచోట చలము వెగ్గలమౌను
నొరసి పెనగేచోట నుమ్మగిలు వలపు|| ||అడుగరె ఈ మాట||

వొలసి నొల్లనిచోట వొనరపు నగవులు
బలిమిచేసేచోట అమరదు పంతమురాదు
అలుకచూపేచోట అమరదు వినయము
చలివాసి వుండేచోట చెండిపడు పనులు|| ||అడుగరె ఈ మాట||

ననుపులేనిచోట నమ్మికచాలదు పొందు
అనుమానమైనచోట అంటదు రతి
యనసినాడు వేంకటేశుడు నన్నింతలోనే
తనవివి లేనిచోట దైవారు కోర్కులు|| ||అడుగరె ఈ మాట||

Advertisement

తాజా వార్తలు

Advertisement