రాగం : సింధు భైరవి
నీవు దేవుడవు నేనొక జీవుడ
యీ విధి నిద్దరి కెంతంతరువు|| ||నీవు దేవుడవు||
పొడమిన జగములు పెట్టెడి జగములు
గుడిగదదొనె మీరోమ కూపముల
యెడయక నీ రూపమేమని ధ్యానింతు
అడిరి మీవాడ నేననుటే కాక|| ||నీవు దేవుడవు||
మునుపటి బ్రహ్మలు ముందరి బ్రహ్‌మ లు
మొన సి మీ నాభిని మొలచేరు
ఘనుడవు ని న్నేగతి నే తెలిసెద
అనువుగ మిము శరణనుటే కాక|| ||నీవు దేవుడవు||
- Advertisement -
సహజానందమగు సంసారానంద-
మిహము పరముగా నిచ్చేవు
అహిపతి శ్రీ వేంకటాధిప నీకృప
మహిలో సేవించి మనుటే కాక|| ||నీవు దేవుడవు||