రాగం : గంభీరనాట
తిరొతిరొ జవరాల తిత్తి తిత్తి ఈ
తరలమైన నీ తారహార మదురే || ||తిరొతిరొ జవరాల ||
ధిమి ధిమ్కి తోంగ తొంగ దిద్ధిమిక్కి ఆరే
మమారే పాత్రారావు మజ్జా మజ్జా
కమలనాభుని తమకపుటింతి నీకు
అమరె తీరుపు ఇదె అవధరించగదో || ||తిరొతిరొ జవరాల ||
ఝుక జక్క జంఝుం ఝణకిణాని
ప్రకటపు మురువొప్పె భళాభళా
సకల పతి కి సరసపు కొమ్మ నీ
మొకసిరి మెరసె చిమ్ముల మురిపెముల || ||తిరొతిరొ జవరాల ||
మాయిమాయి అలమేలు మంగనాచ్చారి మతి
బాయని వేంకటపతి పట్టపురాని
మ్రోయ చిరుగజ్జెల నీ మ్రోతలానేని
సోయగమైన నీ సొలపు చూపమరె || ||తిరొతిరొ జవరాల ||