రాగం : గంభీరనాట
తుద సమస్తమును దుర్లభమే
అదెసులభుడు మా హరి యొక్కడే || ||తుద సమస్తమును||
సురలను నరులును సొంపగు సిరులును
వొరసిన నిన్నియు నుపాధులే
నిరుపాధికుడును నిజకరుణానిధి
అరయగనిదె మా హరియొకడే || ||తుద సమస్తమును||
అదరి యీవులు అఖిల కర్మములు
అందగరాని ప్రయాసములే
యిందిరా రమణునిమతియిది
హిత పరిపూర్ణం బిదియెకటే || ||తుద సమస్తమును||