Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : దేహినిత్యుడు

రాగం : తోడి

దేహినిత్యుడు దేహములు అనిత్యాలు
ఈహల నామనసా ఇది మరువకు మీ || ||దేహినిత్యుడు||

గుది పాతచీర మాని కొత్తచీర గట్టినట్టు
ముదిమేను మాని దేహి మొగి గొత్త మేనిమోచు
అదన చంపగలేవు ఆయుధమ్ము లీతని
కదిసి అగ్నియు నీరు గాలియు చంపగలేవు || ||దేహినిత్యుడు||

యీతడు ననరకువడడు యాతడగ్ని కాలుడు
యీతడు నీట మేనుగడు యీతడు గాలిబోడు
చేతనుడై సర్వగదుడౌ చెలియించడేమిటను
యీతల ననాది యీతడిరపు గదలడు || ||దేహినిత్యుడు||

చేరికానరానివాడు చింతించరానివాడు
భారపు వికారాల పాసిన వాడీ ఆత్మ
ఆరయ శ్రీవేంకటేశునాధీన మీతడని
సారము తెలియుటే సత్యం జ్ఞానము || ||దేహినిత్యుడు||

Advertisement

తాజా వార్తలు

Advertisement