ఒక్కడే ఏకాంగ వీరుడర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము || ||ఒక్కడే ఏకాంగ వీరుడర్వికి ||
మంఉదట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమం తుని కెదురా లోకము || ||ఒక్కడే ఏకాంగ వీరుడర్వికి ||
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయిజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము || ||ఒక్కడే ఏకాంగ వీరుడర్వికి ||
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరువుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధిని
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము || ||ఒక్కడే ఏకాంగ వీరుడర్వికి ||