Monday, November 25, 2024

అన్నమయ్య కీర్తనలు : కానరటేపెంచరటే

రాగం : అఠాణా

కానరటేపెంచరటే కటకటా బిడ్డలను
నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని || ||కానరటేపెంచరటే ||

బాయిట పారవేసిన పాలు వెననలును
చేయి పెట్టకుందురా చిన్నిబిడ్డలు
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక
పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డని || ||కానరటేపెంచరటే ||

మూసిన కాగుల నేయీ ముంగిటి పెరుగులూ
ఆసపడకుందురా ఆడేబిడ్డలు
వోసరించి మోసపోక వుండలేక మీరు
సేసేరింతేసి దూరు చెప్పరాని బిడ్డని || ||కానరటేపెంచరటే ||

చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును
చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు
మిక్కిలి పూజలు సేసి మెచ్చించ తగదా
యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని || ||కానరటేపెంచరటే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement