రాగం : ఖరహరప్రియ
దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో
ఉబ్బు నీటిపై నొక హంస || ||దిబ్బలు వెట్టుచు||
అనువున కమల వి హారమె నెలవై
ఒకనరి యున్నదిదె ఒక హంస
మనియెడి జీవుల మానస సరసుల
వునికి నున్నదిదె ఒక హంస || ||దిబ్బలు వెట్టుచు||
పాలు నీరు వేర్పఱచి పాలలో
నోల లాడెనిదె యొక హంస
పాలుపడిన యీ పరమహంసముల
ఓలి నున్న దిదె యొక హంస || ||దిబ్బలు వెట్టుచు||
తడవి రోమ రంధ్రంబుల గ్రుడ్లను
ఉడుగక పొదిగీనొక హంస
కడు వేడుక వేంకటగిరి మీదట
నొడలు పెంచె నిదె యొక హంస || ||దిబ్బలు వెట్టుచు||