రాగం : దుర్గా
ఆణికాడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా || ||ఆణికాడవట||
ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపు వెలలెరుగుదు వటవో
అంగడి బేహారి యవి గొనవయ్యా || ||ఆణికాడవట||
మొల్లమి మాచెలి మోవి మాణికము
అల్ల వెలకు మీ కమ్మీనదే
తొల్లినీవు సూదులవాట్లచే
కొల్ల లాడితట కొనవయ్యా || ||ఆణికాడవట||
నిడుదల చూపుల నీలంబులు నీ –
వడిగినంతకే యమ్మీనదే
పడతిదె శ్రీవేంకటపతి నీ విదె
యెడయని కాగిట నిటుగొనవయ్యా || ||ఆణికాడవట||