రాగం : శ్రీరాగం
అహోబలేశ్వరుడు అఖిలవందితుడు
మహినితనిగొలిచి మనుడికజనులు ||అహోబలేశ్వరుడు ||
మూడు మూర్తులకు మూలంబీతడు
వేడి ప్రతాపపు విభుడీతడు
వాడి చక్రాయుధ వరదుడీతడు
పోడిమిపురాణ పురుషడీతడు ||అహోబలేశ్వరుడు ||
అసురుల కెల్ల కాలాంతకు డీతడు
వసుధ దివ్య సింహంబితుడు
విసువని మేకాంగ వీరుడీతడు
దెసల పరాత్పర తేజంబి తడు ||అహోబలేశ్వరుడు ||
నిగిడి శ్రీవేంకట నిలయుడీతడు
వొగివాయని శ్రీపతియితడు
సొగిసి దాసులకు సులభుడీతడు
తగు నిహపరముల దాతయు నితడు ||అహోబలేశ్వరుడు ||