Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : నానా దిక్కుల నరులెల్లా

రాగం : ఆహిరి

నానా దిక్కుల నరులెల్లా
నానా దిక్కుల నరులెల్లా
వానలలోననె వత్తురు గదిలి|| ||నానా దిక్కుల నరులెల్లా||

సతులు సుతులు పరిసరులు బాంధవులు
హితులు కొలువగా ఇందరును
శతసహస్ర యోజనవాసులు సు-
వ్రతములతోడవె వత్తురు కదలి|| ||నానా దిక్కుల నరులెల్లా||

ముడుపులు జాళెలు మొగి తలమూటలు
కడలేని ధనము కాంతులును
కడు మంచిమణులు కరులు తురగములు
వడిగొని చెలగుచు వత్తురు కదలి|| ||నానా దిక్కుల నరులెల్లా||

మగుటవర్థనులు మండలేశ్వరులు
జగదేకపతులు చతురులును
తగు వేంకటపతి దరుశింపగ బహు
వగల సంపదల వత్తురు కదలి|| ||నానా దిక్కుల నరులెల్లా||

Advertisement

తాజా వార్తలు

Advertisement