Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : వన నిధి కురిసిన

రాగం : హవీర్‌ కళ్యాణి

వన నిధి కురిసిన వానలివి మతి
లేని పనుల భారములు ||వన నిధి కురిసిన||

అడవుల వెన్నెల లారిడి బదుకులు
తడతాకుల పరి తాపములు
వొడలొసగిన హరి నొల్లక యితరుల
బడి బడి దిరిగిన బంధములు ||వన నిధి కురిసిన||

కొండల నునుపులు కొనకొన మమతలు
అండల కేగిన నదవదలు
పండిన పంటల పరమాత్ము విది
బండయి తిరిగిన బడలికలు ||వన నిధి కురిసిన||

- Advertisement -

బచ్చన రూపులు పచ్చల కొలుపులు
నిచ్చల నిచ్చల నెయ్యములు
రచ్చల వేంకట రమణుని గొలువక
చ చ్చియు చావని జన్మములు ||వన నిధి కురిసిన||

బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చల నిచ్చల నెయ్యములు
రచ్చల వేంకట రమణుని గొలువక
చచ్చియు చావని జన్మములు ||వన నిధి కురిసిన||

Advertisement

తాజా వార్తలు

Advertisement