ప|| కలిగె మాకు నిది కైవల్యం
కలకాలము హరికథాశ్రవణం || కలిగె ||
చ|| అచింత్య మద్భుత మానందం
ప్రచురం దివ్యం పావనం
సుచరిత్రం శ్రుతి శోభితం
అచలం బిదివో హరికీర్తనం || కలిగె ||
చ|| నిరతం నిత్యం నిఖిల శుభకరం
దురితహరం భవదూరం
పరమ మంగళం భావాతీతం
కరివరదం నిజకైంకర్యం || కలిగె ||
చ|| సులభం సుఖదం శోకనాశనం
ఫలదం లలితం భయహరణం
కలితం శ్రీ వేంకటపతి శరణం
జలజోదర నిచ్చ స్తోత్రం || కలిగె ||