రాగం : గోరక్ కళ్యాణ్
ఏదితుది దీని కేదిమొదలు
పాదుకొను హరిమాయ పరగు జీవునికి||
ఎన్ని బాధలు తనకు నెన్నిలంపటములు
యెన్ని వేదనలు మరి యెన్ని దు:ఖములు
యెన్ని పరితాపంబు లెన్ని తలపోతలు
యెన్ని చూచిన మరియు నెన్నైన కలవు||
యెన్ని కొలువులు తనకు నెన్ని యనుచరణలు
యెన్ని యాసలు మరియు నెన్ని మోహములు
యెన్ని గర్వములు తనకెన్నిదైన్యంబు లివి
ఇన్నియును తలప మరి యెన్నైన గలవు||
యెన్నిటికి చింతించు నెన్నిటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు
యిన్నియును తిరువేంకటేశు లీలలు కాగ
ఎన్ని చూచినను తానెవ్వడును కాడు||