Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : పరమ పాతకుడ

రాగం : హంసానంది

పరమ పాతకుడ భవ బంధుడ శ్రీ
హరినిను దలచనే నరుహుడనా || ||పరమ పాతకుడ||

అపవిత్రుడనే నమంగళుడ కడు
నపగత పున్యుడ నలసుడను
కపట కలుష పరికర హృదయుడనే
నపవర్గమునకు అరుహుడనా || ||పరమ పాతకుడ||

అతిదుష్డుడ నే నధిక దూషితుడ
హత వివేక మతి నదయుడను
ప్రతిలేని రమాపతి నినుదలచే
నతులగతికి నే నరుమడనా || ||పరమ పాతకుడ||

- Advertisement -

అనుపమ విషయ పరాధీనుడనే
ననంత మోహ భయాతురుడ
విను తింపగ తిరు వేంకటేశఘను
లనఘులుగాక నే నరుహుడనా || ||పరమ పాతకుడ||

Advertisement

తాజా వార్తలు

Advertisement