Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : నేలమిన్ను ఒక్కటైన

రాగం : గౌళ

నేలమిన్ను ఒక్కటైన నీబంటు వొక్క –
వేలనే యక్షుని తెగవేసెగా నీ బంటు || ||నేలమిన్ను ఒక్కటైన||

ఉంగరమెగరవేసి, యుదధిలో బడకుండ
నింగికి చేయిచాచె నీ బంటు
చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద
కుంగదొక్కి పదముల కుమ్మెగా నీ బంటు || ||నేలమిన్ను ఒక్కటైన||

వెట్టగా రావణు రొమ్మువిరుగ చేతనే గుద్దె
నిటట్తాడువంటి వాడు నీ బంటు
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలుగ తెచ్చె బాపురే నీ బంటు || ||నేలమిన్ను ఒక్కటైన||

- Advertisement -

అలర నన్నియు జేసి అజునిపట్టానకు
నిలుచున్నాడదివో నీ బంటు
బలువేంకటేశ ఈ పవననందనుడు
కలిగి లోకములెల్ల కాచెగా నీ బంటు || ||నేలమిన్ను ఒక్కటైన||

Advertisement

తాజా వార్తలు

Advertisement