రాగం : ఆనందభైరవి
చూడచూడ నింతలోనె శుక్రవారమునాడు
ఆడనీడ విభవాలె అమరే దేవునికి || ||చూడచూడ నింతలోనె||
మేటిపాల జలధిలో మీగడలంటెనొ గానీ
మీటనె దొంగిలినట్టి వెన్నలంటెనో
నూటుకాకాశగంగ (మ) నురుగంటెనో యనగ
ఆటల కర్పూరకాపు అమరే దేవునికీ || ||చూడచూడ నింతలోనె||
శిశువులు దెచ్చునాడు చీకటియంటెనో గాని
మసలక కరిగాసె మదమంటెనో
సుసరాననీలికాసె సొగసంటెనో యనగ
అసుదై పుణుగుకావు అమరే దేవునికీ || ||చూడచూడ నింతలోనె||
- Advertisement -
పరమతేజంబైన ప్రభలుచల్లెనో గాని
వురము శ్రీసతియున్న వొరపులివి
అరిది శ్రీవేంకటేశు అలమేలుమంగ తోడ
అరలేక సొమ్మెలెల్ల అమరే దేవునికి || ||చూడచూడ నింతలోనె||