రాగం : ఆనంద భైరవి
చూడ పిన్నవాడు గాని జూటుదనాల నెక్కుడు
యేడ చూచినా తాను యీ విట్ఠలుడే || ||చూడ పిన్నవాడు
గాని||
గోవులలో విహరించే గోవిందుడు పెక్కు
వావుల గోపికలకు వల్లభుడు
చేవమీరి ముద్దుల శ్రీకృష్ణుడు
యేవల్లజూచినాను యీ వి ట్ఠలుడే || ||చూడ పిన్నవాడు గాని||
వింత మధురాంగనల వేడుకకాడు
చెత కొలని సతుల సిగ్గులవాడు
కాంత లక్ష్మీపతి వేంకటేశ్వరుడు
యింతటా వినోదించీ నీ విట్ఠలుడే || ||చూడ పిన్నవాడు గాని||