రాగం : ముఖారి
చిరంతనుడు శ్రీవరుడు
పరమంభవ్యం పావనం ||చిరంతనుడు శ్రీవరుడు||
వేదమయుడు కోవిదుడమలుడు పరు
డాదిమ పురుషుడు మహా మహుడు
యేదెస నేమని యేది తలచినన
ఖేదమ వాద మఖిల సమ్మతం ||చిరంతనుడు శ్రీవరుడు||
నిఖిలమయుడు మునివరదు డధికుడు
మఖ ముఖ శుకాభిమ తరతుడు
శిఖరం శివం సుశీలన మతిశయ
ముఖరం ముఖ్యం మూలమిదం ||చిరంతనుడు శ్రీవరుడు||
- Advertisement -
అనేక ప్రదుడానాది నిధనుడు
ఘనుడీ తిరువేంకట విభుడు
దినం దినం సముదితర వికోటిభ-
జనం సిద్ధాంజనం ధనం ||చిరంతనుడు శ్రీవరుడు||