రాగం : శంకరాభరణం
వట్టి లంపటాల బడి వడ బొరలుట కంటే
వొట్టినవిరతి నూరకుండ టే సుఖము || || వట్టిలంపటాల ||
పాపము మానినయట్టి బదుకొక్కటె సుఖము
కోపము విడిచినట్టి గుణ మొక్కటి సుఖము
చెపట్టి గురుబుద్ధి సేసేటిదే సుఖము తీ
దీపుల బడనియట్టి దినమే సుఖము || || వట్టిలంపటాల ||
మహి చంచలము లేని మనసొక్కటి సుఖము
సహజాచారముతోడి జన్మమొక్కటి సుఖము
యిమపర సాధపు యెన్ని కొక్కటి సుఖము
బహుళపుటాస కంటె పరిపాటి సుఖము || || వట్టిలంపటాల ||
- Advertisement -
పరుల పీడించితేని పసి డొక్కటి సుఖము
గరిమ నిజముతోడ గలమాటలే సుఖము
ధర శ్రీ వేంకటేశు దాసాను దాసుడయి
సరవితో నడచేటి శాంతమే సుఖము || || వట్టిలంపటాల ||