రాగం : మధ్యమావతి
వద్దే గొలత వదలకువే నీ
ముద్దు మాటలకు మొక్కేవయ్యా || ||వద్దే గొలత ||
ఏలే ఏలే ఏలే గొల్లెత
నా లాగెరగవ నన్నునేచేవు
చాలు చాలునిక చాలు నీ రచనలు
పోలవు బొంకులు పోవయ్యా|| ||వద్దే గొలత ||
కానీ కానీ కానీ (లే) గొల్లెత
పోనీలే నీ వెందువోయినను
మాని మాని పలుమరు చెనకుచు మా –
తో నిటు సొలయక తొలవయ్యా | ||వద్దే గొలత ||
- Advertisement -
రావా రావా రావా గొల్లెత
శ్రీ వేంకటగిరి చెలువుడను
నీవె నీవె నను నించితి కౌగిట
కైవసమైతిని కదవయ్యా | ||వద్దే గొలత ||