రాగం : శుద్ధధన్యాసి
చాలుజాలును భోగసమయమున మైమఱపు
పాలుపడునట యేటి బ్రదుకురా వోరి || ||చాలుజాలును ||
ఇందుముఖి నిను గౌగిలించి లోపలి జగము
కందునని నీ బిగువు గౌగిలే వదలె
పొందైన వారితో బొసగ గౌగిట జేర్ప
బొందు గాదట యేటి పొందురా వోరి || ||చాలుజాలును ||
నెలత నీవాలు గన్నులు మూసి జగమెల్ల
గలయ జీక ట్లైన గక్కనను వదలె
వలచి నంగనలు తమ వలసిన విలాసముల
వలను నెరపనిదేటి వలపురా వోరి || ||చాలుజాలును ||
- Advertisement -
కొమ్మ నీ వురము పై గోరుదివియుచు నాత్మ
నిమ్మైష నను దాక నిద్దరిని దాకె
దిమ్మరివి కోనేటితిమ్మ నీ పై బ్రియము
కుమ్మరించని దేటి కోర్కిరా వోరి || ||చాలుజాలును ||