రాగం : ముభారి
కొలనిలోన మును గోపికలు
మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు | ||కొలనిలోన ||
పిరుదులు దాటిన పించెపు టలకల
తురుములు వీడగ దొయ్యలులు
అరిది నితంబము లందునె దాచుక
మురిపెపుగరముల మొక్కిరి నీకు || ||కొలనిలోన ||
నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె కట్టుచును
ముద్ద టుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మొక్కిరి నీకు || ||కొలనిలోన ||