ఇటు గరుడని నీ వెక్కినను
పటపట దిక్కులు బగ్గన బగిలె ||
ఎగసినరగరుడని యేపున థా యని
జిగిదొలక చబుకుచేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడగడ వడకె ||
బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరిత ములై
తిరుపున నలుగడ దిరదిర దిరిగె ||
పల్లించిన నీ పసిడి గరుడనిని
కెల్లువ నీ వెక్కి నయపుడు
ఝల్లనె వెక్కి సమితి నీ మహిమ
వెల్లి మునుగుదురు వేంకటరమణా ||