అభయదాయకుడ వదె నీవే గతి
యిభరక్షక నను నిపుడు గావవే ||
భయహర దైతేయభంజన కేశవ
జయజయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి
క్రియగా మమ్మేలి కింక లుడుపవే ||
బంధవిమోచన పాపవినాశన
సింధురవరదా శ్రితరక్ష
కంధరవర్ణుడ గతి నీనామమె
అంధకారముల నణచి మనుపవే ||
దైవశిఖామణి తతచక్రాయుధ
శ్రీ వేంకటగిరి శ్రీ రమణా
సావధాన నీశరణ్యమే గతి
వేవేలకు నావిన్నప మిదియే ||