రాగం : నాట
ప|| ఆనంద నిలయ ప్రహ్లాద వరదా
భాను శశినేత్ర జయ ప్రహ్లాద వరదా
చ|| పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా
హరి యచ్యుతానంత ప్రహ్లాద వరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా
భరితకళ్యాణ గుణ ప్రహ్లాద వరదా
చ|| భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా
అవిరళ కేశవ ప్రహ్లాద వరదా
పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా
భవపితామహ వంద్య ప్రహ్లాద వరదా
చ|| బలయుక్త నరసింహ ప్రహ్లాద వరదా
లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా
ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా
బలివంశ కారణ ప్రహ్లాద వరదా