రాగం : యమన్
ఎటువంటి యాగ డీడే యీ కృష్ణుడు
జొట జొట గారగానీ జుఱ్ఱీ మీగడలు
కొట్టె క ృష్ణుడు వాడె కోలలెత్తి వుట్ల పై
దట్టముగ గొల్లెతలు దాచిన పాలు
చుట్టిన చక్కిలములు చొక్క పునురుగులును
బెట్టిన కాగుల తోనె పెంచలుగ జేసేనే
దొంతులు దించి దించి దొంకొనీ కృష్ణుడు
బంతి చక్కెర వెట్టి గొపాలుల కెల్ల
మంతనానా వద్దని మాను పబోతే తాను
కొంతవారీ నోర పెరుగులు చమరీనే
వీధులెల్లా తానే శ్రీ వేంకటాద్రి కృష్ణుడు
ఆది గొని మెసగీని అలుకు లెల్ల
కాదని పెనగి తేను కాగిలించీ గొల్లెతల
సోదించి కుచములంటీ సొంపుగా కూడేనే