Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : దొరకునా యితని కృప

రాగం : సామంతం

దొరకునా యితని కృప తుది పదంబు
అరిది విభవము లొల్లమనినా సొదలు || ||దొరకునా యితని కృప||

సొపలర నితడు కృప జూచుటరుదనికాక
యింపు సామాన్యమా ఇతని కరుణ
లంపటము ఘనమైన లక్ష్మీకటాక్షములు
సంపదలు తోడనే చల్లు వెదలాడు || ||దొరకునా యితని కృప||

తగనితనిపై భక్తి తగులుటరుదనికాక
వగుట సామాన్యమా ననిచి యితడు
జగదేక హితములుగ సరసతుల సౌఖ్యములు
దిగులువాయగ నితడు దిప్పుదీరుడు || ||దొరకునా యితని కృప||

తిరువేంకటాద్రి సిద్ధించుటరుదనికాక
మరుగదను నిచ్చునా యరియొకరిని
యిరవైన భోగములు యిష్ట సామ్రాజ్యములు
విరివిగొని యితని దయ వెంటనే తిరుగు || ||దొరకునా యితని కృప||

Advertisement

తాజా వార్తలు

Advertisement