శ్రీహరి చేసిన చిహ్నలివి యీ
మోహము విడుచుట మోక్షమిది || ||శ్రీహరి చేసిన చిహ్నలివి||
మలినంబేది మణు గననేది
కలుషపు మలముల కాయమిది
కలిగిన దేది కడులేందేది
చలనపు మాయల జన్మమిది || శ్రీహరి చేసిన చిహ్నలివి
తనిసిన దేది తనియని దేది
దిన దినమాకలి దీరదిది
కొనయిందేది గుఱి మొదలేది
పనిగొను కర్మపు బంధమిది || శ్రీహరి చేసిన చిహ్నలివి
నిండిన దేది నిండని దేది
కొండల పొడవుల కోరికది
అండనె శ్రీ వేంకటాధిపు శరణని
వుండుటే యిహ పర యోగమది|| శ్రీహరి చేసిన చిహ్నలివి