Wednesday, November 20, 2024

అన్నమయ్య కీర్తనలు : పాపపుణ్యముల

రాగం : కామవర్ధిని

పాపపుణ్యముల పక్వమిదెరుగును
నా పాలిటి హరి నమో నమో || ||పాపపుణ్యముల||

మానసవాచక మతకర్మంబుల
తానకముగ నీ దాసుడను
పూని త్రిసంధ్యల భోగభాగ్యముల
నానాగతులను నమో నమో || ||పాపపుణ్యముల||

వలనుగ జాగ్రత్‌ స్వప్నసుషుప్తుల
యిలలో నీకే హితభటుడ
వెలుపల లోపల వేళావేళల
నళినాక్షా నీకే నమో నమో || ||పాపపుణ్యముల||

- Advertisement -

పుట్టక తొలుతను పుట్టిన మీదట
అట్టె నీ శరణాగతుండ
గట్టిగ శ్రీ వేంకటపతి నీ కృప
నట్టనడుమైతి నమో నమో|| ||పాపపుణ్యముల||

Advertisement

తాజా వార్తలు

Advertisement