రాగం : కీరవాణి
అదెలంక సాధించె నవని భారము దించె
విదితమై ప్రతాపము వెలయించె నితడు|| ||అదెలంక సాధించె||
నదవంశ తిలకుడు రాముడితడు
భూవిపుట్టె దశరథపుత్రుడితడు
భువుడెంచే తారక బ్రహ్మమీతడు
పవనజుకిచ్చినాడు బ్ర హ్మపట్టమితడు|| ||అదెలంక సాధించె||
బలువుడు సీతాపతి యితడు
తలకొన్న వాలిమర్దనుడితడు
విలసిల్లె ఏకాంగ వీరుడీతడు
చలమరి కోదండదీక్షా గురుడితడు|| ||అదెలంక సాధించె||
శరణాగత వ జ్ర పంజరుడీతడు
సరిలేని అసురభంజకుడీతడు
వరదుడు శ్రీ వేంకటేశ్వరుడితడు
అరయ విజయనగరాధీశుడితడు|| ||అదెలంక సాధించె||