ప|| కొలువుడీ భక్తి కొండల కోనేటి
నిలయుని శ్రీ నిధియైన వాని || కొలువుడీ ||
చ|| ఆది దేవుని అభవుని సామ
వేదనాద వినోదుని నెర
వాదిజితప్రియుని నిర్మల తత్త్వ
వాదుల జీవనమైన వాని || కొలువుడీ ||
చ|| దేవదేవుడైన దివ్యుని సర్వ
భావాతీత స్వభావుని
శ్రీ వేంకటగిరి దేవుడైన పర
దేవుని భూదేవ తత్పరుని || కొలువుడీ ||