మనదేశంలో రాజులంతా ధర్మానుపర్తులై శాస్త్రాలననుసరించి పరి పాలన చేశారు. అందుకు ఉదాహరణ ఛత్రపతి శివాజీ.. ఆయన సమర్థ రామదాసస్వామి శిష్యుడు. రామదాసస్వామి ఆంజనేయుని అవతారమని అంటారు. సదా రామనామ పరాయణుడు. శివాజీ గురువు గారి అనుగ్రహ బలం వల్లనే అందరిని కూడగట్టుకొని ఢిల్లి రాజులను ఎది రించాడు. ఉత్తర భాగంలో ధర్మమార్గాన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. శివా జీ ఎన్ని గ్రామాలు గెలిచినా సమర్థ రామదాసస్వామి దగ్గరకు వచ్చి- ”స్వామీ! ఈ గ్రామాలన్నీ మీవి” అని సమర్పణ చేసేవాడట. ”ఈ గ్రామాలు నా కెందుకు? వీనిని నాకు ప్రతినిధిగా నీవే పరిపాలించు”- అని గురువు బదులు పలికేవారట. శత్రుకాంతను సైతం చెరపట్టక, హంసించక- శివాజీ వారికి తోడిచ్చి స్వజనుల దగ్గరకు పంపేవాడట.
గోదావరి తీరంలో పంచవటిలో సమర్థ రామదాసస్వామి ”శ్రీరామ జయరామ జయజయ రామనామ” అనే త్రయోదశాక్షరీ మంత్రాన్ని జపి స్తూ 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కా రాన్ని పొందిన సాధు పురుషుడు. హిందూ సమాజాన్ని ఉద్ధరించాలంటే సమాజంలో శక్తిసామర్థ్యాలను పెంపొందించాలనుకున్నాడు. శక్తిరూప సమాజం నిర్మాణం కావాలని అందరికి ఉపదేశించాడు. ప్రజలను ధార్మిక, జాతీయ భావాల పట్ల చైతన్యపరచాడు. ప్రతిచోట వీరహనుమాన్ విగ్రహా లను ప్రతిష్టాపన చేయించేవాడు. రాముడిని, హనుమంతుడిని ఉపాసించని ప్రచారం చేశాడు. అనేకచోట్ల వేలాది సంఖ్యలో మఠాలు, వ్యాయామశాల లను స్థాపింప చేశాడు. తన శిష్యులకు ”శ్రీరామ జయరామ జయజయ రామరామ” అనే మంత్రం ఉపదేశించి ఉంఛవృత్తితో జీవించమని ఆదేశించే వారట. తంజావూరు మహారాష్ట్రుల పరిపాలనలో ఉన్నప్పుడు- అక్కడ కూ డ నాలుగైదు మఠాలు ఏర్పడ్డాయి. మహారాష్ట్ర దేశంలో చాలా మఠాలు వెలసాయి. వానిని ‘రామదాసు’లనే అంటారు. దీనంతటికి కారణం సమర్థ రామదాసులోని ఆంజనేయుని ప్రభావమే.
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా!
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్!!
వేదాంతం క్షుణ్ణంగా పరిశీలించినవారు కొందరుంటారు. కాని వారి దేహం చిక్కి శిథిలమై ఉంటుంది. మనస్సులో ఎక్కడలేని ధైర్యమూ ఉం టుంది. కాని, శరీరంలో చేవ ఉండదు. కొందరికి అలాకాక దేహ దారుఢ్యం ఉంటుంది. కాని మనస్సు మాత్రం పిరికి. ఒకదాని కొకటి విరోధముగా ఉంటాయి. మొదట మార్గమున- దుర్మార్గమున వెళ్ళేవాడు ఒక డుంటాడు. భక్తి వుండదు. కొందరికి భక్తి ఉంటుంది. కాని జ్ఞానముండదు. మూఢభక్తి మాత్రము ఉంటుంది.
కాని ఆంజనేయ భక్తులు అలాకాదు. ఆంజనేయుని గూర్చి చెపుతూ శ్రీరామచంద్రుడాయనను ‘నవవ్యాకరణవేత్త’ అన్నారు. అంతేకాదు. ఆయన తత్వవేత్త కూడా. ‘పైశాచి’ అనేది ఒక భాష. ఆ భాషతో భగవద్గీతకు ఒక భాష్యం ఆంజనేయస్వామి వ్రాశారు. దానికి ‘పైశాచ్య భాష్య’మని పేరు. హనుమంతుడు తనను ఉపాసించినవారికి బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తా డు. ‘బలం ఉంది- ధైర్యం లేదు’, ‘ధైర్యం ఉంది- బలంలేదు’. అనుట ఉండదు. అలాంటివారే సమర్థ రామదాసు.
అరవ దేశంలో ఆంజనేయస్వామిని ‘హనుమార్’ అని వ్యవహారం. తెలుగుదేశంలో ఆంజనేయ శబ్దం ఎక్కువ. కన్నడులు ‘హనుమంతయ్య’ అని అంటారు. మహారాష్ట్ర దేశంలో ‘మారుతి’ అని ప్రసిద్ధి, ‘బెంగాల్, కాశ్మీర్, మధ్యప్రదేశ్‌లలో మహావీర్ శబ్దాన్ని ఎక్కువగా వాడతారు. ఆంజనే యుడు భక్తికి పరాక్రాంతికీ నెలవు. ఆయన కాయనయే సాటి.
”యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం”
రామ శబ్దము, రఘునాథుని కీర్తనలు వినిపించే ఏ ప్రదేశంలో అయినా సరే మన కళ్ళకు కనిపించకుండా ఆంజనేయస్వామి శ్రవణానందంలో మునిగిపోయి కళ్ళ నుండి నీరు ధారగా కారుస్తూ ఉంటాడట. శ్రీరామచంద్ర మూర్తి యందు హనుమకు అంత భక్తి. బలంలో, ధైర్యంలో, కీర్తిలో, భక్తి లో- అన్నిట ఆంజనేయుని స్థానం అత్యున్నతమైనది.
వైదేహ సహతం సురద్రుమతలే
హమే మహామంటపే
మధ్యే పుష్పక మాననే మణిమయే
వీరాసనే సంస్థితం,
అగ్రే వాచయతి ప్రభంజననుతే
తత్త్వం మునిభ్య: పరం
వ్యాఖ్యాతం భరతాదిభి: పరివృతం
రామం భజే శ్యామలమ్|
దక్షిణామూర్తి సనకాదులకు జ్ఞానోపదేశం చేసే రీతిలో శ్రీరాముడు- ఆంజనేయునికి చేశాడు.
భక్తితో తన గురువు నామమును జపించేవారికి, తనను కొలిచినవారికి జ్ఞానము భక్తి, బలము, ధైర్యము, వీర్యము, శ్రేయస్సులను ఇచ్చే దైవం ఆంజనేయస్వామి. ఆయన కూడా వీటన్నిటియందు పరిపూర్ణులు. అంతే కాదు అఖండ బ్రహ్మచర్య నిష్ఠులు. ఒక్క క్షణము కూడ కామము అనే విష యమే వారి దరిచేరని ఆంజనేయుల అవతారమే సమర్థ రామదాసస్వామి! వీరి బలముచేతనే మహారాష్ట్రలో ఒక పెద్ద రాజ్యమేర్పడింది. ఇంగ్లీషు వారు కూడా ఎక్కువగా మహారాష్ట్రులతోనే యుద్ధము చేయ వలసివచ్చేది. ఇలా తత్త్వము, శాస్త్రము- ధర్మము- వీటి ఆధారంతో ఏర్ప డిన రాజ్యాలు చాలా కాలం నిలిచి వున్నాయి.