ఒకసారి పరాశర మహర్షిని మైత్రేయుడు ”కలి కాలంలో దు:ఖాలను దూరంచేసేది, దారిద్య్రా న్ని పోగొట్టేది, వ్యాధుల నుండి రక్షించేది, సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా వుంటే తెలియజేయండి” అని అడిగాడు.
దానికి ఆ మహర్షి ”మైత్రేయా! మంచి ప్రశ్న వేశా వు. నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెబుతాను విను. అది సకల వేద శాస్త్ర, పురాణాదుల సారమే. వెంటనే ఫలితాన్నిచ్చేది. నేను ఒకసారి సర యు నది దగ్గరవుండగా, నా తండ్రి వసిష్టుడు నాకు వెంటనే ఫలితమిచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు. శివ, వైష్ణవ, శాక్తేయ మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు. వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీనారా యణ విద్య, భవానీశంకర విద్య, సీతారామ మహా విద్య, హనుమన్మహా విద్య చాలా ముఖ్యమైనవి. వీటి తరువాత నృసింహ విద్య, బ్రహ్మాస్త్ర విద్య, అస్తార్ణ మారుతీ విద్య, సామ్రాజ్యలక్ష్మి విద్య, మహాగణపతి విద్య, సౌరవిద్య, దక్షిణ కాశీవిద్య, చింతామణి విద్య. వీటిలో దక్షిణ కాళికావిద్య ఒక్కరాత్రిలో నా ఫలితాన్ని స్తుంది. అస్తార్ణ మారుతీవిద్య ఇంకా తక్కువ సమ యంలో ఫలితం చేకూరుస్తుంది. నృసింహవిద్య ఇంత కంటే తక్కువకాలంలో ఫలిస్తుంది. వీటి అన్నింటికం టే గురువు ద్వారా పొందిన ”పంచ వక్త్ర హనుమాన్ మంత్రం”. శీఘ్రంగా సిద్ధినిస్తుంది.
ఈ జప మహాత్మ్యం వల్లనే అగస్త్యుడు సప్త సము ద్రాల నీటిని పుడిసిలిలో పట్టి తాగగలిగాడు. అర్జునికి, భీమునికి శత్రువులను జయించే శక్తి, దీనివల్లే కలిగిం ది. విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీరామానుగ్రహంతో పొందాడు. హనుమాన్మంత్రం చేత జయం, గౌరవం, రాజ్యం, జనవశ్యం, అచంచల భాగ్యం కలుగుతాయి. ధర్మా, కామ మోక్షాలు, ఆపద లను పోగొట్టుకోవటం, శత్రు జయం, నిగ్రహానుగ్రహ
శక్తి దీనివల్ల సాధ్యమవుతుంది. వాక్సిద్ధి, పుత్రసంతా నం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే గురుముఖతా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది, గురువును సంతప్త్తి రిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం ఉంటుంది. పరిశుద్ధమైన మనసుతో నూట ఎనిమిదిసార్లు మంత్రాన్ని జపించా లి. అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం. పంచ వక్త్ర మహావిద్య గురుకృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది. శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని, వెయ్యి శిరస్సులున్న ఆదిశేషుడు కూడా వందల సంవత్సరా లు చెప్పినా తరగదు.” అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీఆంజనేయ మంత్ర మహాత్మ్యాన్నిచెప్పాడు.
ఆంజనేయస్వామి మంత్ర మహిమ
Advertisement
తాజా వార్తలు
Advertisement