Monday, November 25, 2024

శ్రీరాముడు మలిచిన ఆంజనేయ స్వరూపం!

మన దేశంలో అత్యంత ప్రసిద్ధమైన పవన కుమారుడి క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో 107 హనుమ స్వయంభువై వెలిసినట్లు చెబుతారు. కేవలం ఒకే ఒక్క క్షేత్రంలో మాత్రం శ్రీరామచంద్రుడు స్వయంగా చెక్కిన ఆంజనేయస్వామి విగ్రహం వుంటుంది. ఈ క్షేత్రంలో శ్రీరాముడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కాడు. తన స్వామి ఎంతో ప్రేమగా చెక్కిన తన చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి కొలువుదీరాడు. అదే వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెకు దగ్గరలోని గండి ఆంజనేయస్వామి ఆలయం.

ఈమహిమాన్విత ఆంజనేయ క్షేత్రం వేంపల్లి రాయచోటి మార్గంలో ఉంటుంది. దీనినే వాయు క్షేత్రం అని కూడా పిలుస్తారని పురా ణాల్లో పేర్కొన్నాయి. త్రేతాయుగ కాలానికి సంబంధిం చిన క్షేత్రం ఇది. రాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతు క్కుంటూ వెళుతున్నప్పుడు ఈ క్షేత్రానికి వస్తారు. అప్పుడు ఇక్కడ కొలువైన వాయుదేవుడు రామలక్ష్మ ణులిద్దరిని ఇక్కడ విశ్రాంతి తీసుకోమని కోరతాడు. అప్పుడు వారు మేము సీతాదేవితో తిరిగివస్తాను అప్పు డు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాము అని మాట ఇస్తా రు. లంకకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుంచి సీతను తీసుకుని వస్తున్నప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చిన శ్రీరామచంద్రుల వారు గండి క్షేత్రంలో ఆగి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. వాయు దేవుడి ఆతిథ్యాన్ని కూ డా స్వీకరించారు.
వాయుదేవుడి ఆతిధ్యానికి మిక్కిలి పరవశించిన శ్రీరామచంద్రుడు, తన ప్రియ భక్తుడు వీరాంజనేయుడు సీతాదేవి జాడను కనిపెట్టాడు. సీతను తీసుకురావడంలో ఎంతో సహాయం చేశాడు. అలాగే వారథి కట్టడంలో కూడా సహాయం చేశాడు. తనకు ఆంజనేయుడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా తనకు ఆంజనేయుడు మీద ఉన్న ప్రేమను అంతా కురిపించి తన దగ్గర ఉన్న బాణంతో ఆంజనేయుని రూపాన్ని చెక్కడం మొదలుపెట్టాడు శ్రీరాముడు. రూపం పూర్తి అయ్యే సమయానికి అమృత ఘడియలు అయిపోయి రాహుకాలం ప్రవేశి స్తుండటంతో కాలి చిటికెన వేలు చెక్కడం వదిలేశాడట శ్రీరాముడు.
ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో ఆంజనేయ స్వామి వారక్కడ సజీవ రూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీలేక ఆ స్థలంలోనే ఆలయా న్ని నిర్మించారట.
ఆ తరువాతి కాలంలో చాలామంది శిల్పులను పిలిపించి ఆ చిటికెన వేలుని చెక్కే ప్రయ త్నం చేశారు. కానీ ఎవరు చిటికెన వేలు చెక్కే ప్రయత్నం చేసినా ఆ ప్రదేశంలో రక్తం కారు తుంది. దానితో అక్కడ ఉన్న వారందరూ ఈ విగ్ర#హంలో స్వయంగా ఆంజనేయస్వామి కొలువుదీరి ఉన్నాడని భక్తులు విశ్వసించారు. ఇక అప్పటి నుంచి ఆ చిటికెన వేలు చెక్కే ప్రయ త్నాన్ని విరమించుకున్నారు.

పాపాలను హరించే పాపాగ్ని

ఈ క్షేత్రానికి ఆనుకొని ఈ పాపగ్ని నది ప్రవహస్తుంది. ఈ నదిలో నీటిని ఆంజనేయ స్వామిని అభిషేకించడానికి వాడతారు అని చెప్తారు. ఈ పాపాగ్నిలో స్నానం చేస్తే భక్తుల పాపా లు పోతాయని ఇక్కడున్న వారి నమ్మకం. కోలార్‌ జిల్లాలోని నందికొండే నంది పాదమని చెబుతారు. పాపాగ్ని అంతటా పవిత్రమే అయినా ఐదు స్థలాలలో మరింత పవిత్రమని అంటారు. అవి- దీని ఉత్పత్తి స్థానం నందికొండ ఒకటి. వాయు క్షేత్రంగా గండి రెండవది.

కేశవ తీర్థం మూడవది. భాస్కర క్షేత్రంగా ఉన్న వేంపల్లె నాల్గవది. పా పాగ్ని నది పినాకిని (పెన్నా) నదిలో కలిసేచోటు ఐదవది. ఈ ఐదు స్థా నాలలో పాపాగ్నినది మహా పవిత్రంగా పరిగణింపబడుతోంది. పాపా గ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహముండటంతో మరింత ప్రసిద్ధమైనది.

- Advertisement -

దర్శనీయ ప్రదేశాలు

గండి పుణ్యక్షేత్రంలో పలు దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. భూ మానంద ఆశ్రమం, నామాలగుండు, దాసరయ్య ఓన, మాతంగ గుహ, జీకొండ్రాయుని మేరు పర్వత శిఖరం, శ్రీ చౌడేశ్వరి ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, పావురాలగుట్ట, ఏక దంతపు నాయు ని కోట, గవి మల్లేశ్వర స్వామి ఆలయం, కోదండ రామా లయం, శనీశ్వర ఆలయాలు ఉన్నాయి.
అది గంటి క్షేత్రం యొక్క మహత్యం. ఇక్కడ క్షేత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు పూజావిధానాలు కూడా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రం రెండు కొండల మధ్యలో విస్తరించి ఉంటుంది. ఈ క్షేత్రం దాటి కొంచెం ముందుకు వెళితే అక్కడ ఒ క చిన్న గుహ కూడా ఉంటుంది. ఈ గు#హ చాలా సంవత్సరాల క్రితంది. ఇది చాలా పురాతనమైనటువంటి గుహ. ఆలయ ప్రవేశద్వారం వద్ద పంచముఖ ఆం జనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇది పాపాగ్ని నది. ఈ గండి ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా మహ మాన్వితమైనది. దుష్టశక్తులను తరిమికొట్టే దేవుడి గానే కాక సంతాన ప్రదాతగా కూడా స్వామికి పేరుంది. గండి ఆంజనేయస్వామిని కొలిస్తే సంతానం కలుగు తుందన్న నమ్మకం ఉండడంతో భక్తుల సందడి అధి కంగా ఉంటుంది.

బంగారు తోరణం

రామలక్ష్మణులు సీతతో కలిసి రాకముందే వా యు దేవుడు రెండు కొండల మధ్యలో ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కొండల మధ్య బంగారు తోరణా న్నిఏర్పాటు చేస్తారు. అయితే ఈ బంగారు తోరణం అనేది మరణ సమయానికి ముందు మాత్రమే కొంత
మంది మంచి వ్యక్తుల కు మాత్రమే కనిపిస్తుంది అని

అక్కడ ఉన్న స్థానికులు నమ్ముతారు. అలా కనిపించిన వారిలో అప్పటి జిల్లా కలెక్టర్‌ థామస్‌ మన్రో తన కపటి ప్రయా ణాన ఈ గండి మీదుగా వెళ్లినప్పుడు ఈ తోరణం కనిపించిందట. ఈ తోరణాన్ని చూసిన వారు త్వరలో మరణిస్తారని తెలుసుకోవ డంతో ఆయన అనుచరులు ఎంతో ఆందోళన పడ్డారట. చివరికి అదే నిజమని తేలింది. కడప బ్రౌన్‌ గ్రంథాలయంలోని ఒక పుస్తకంలో ఈ కథనం లభించిందని పరిశోధకులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement