Saturday, November 23, 2024

అంధ గోక్షేత్ర న్యాయము

అంధ అంటే గుడ్డి. గో అంటే గోవు లేదా ఎద్దు. క్షేత్రము పొలము లేదా చేను. అంధ గోక్షేత్రం అంటే గుడ్డెద్దు చేనులో పడి తన నోటికి అం దినది అల్లా తినడం అని అర్థం. ఎద్దు గుడ్డిది అయినంత మాత్రాన దానికి ఆకలి లేకుండా ఉంటుందా? అవయవాల్లో లోపాలున్నా ఆకలి అనేది ప్రతి జీవికి ఉంటుంది.
కానీ అది చేలోకే వెళ్ళకూడదు. యజమాని పెట్టిందే తినాలి. అది చేలో పడితే ఏమౌ తుంది. దానికి అక్కడ ఉన్నది ఎండుగడ్డా? పచ్చిగడ్డా? పంటచేనా? బీడా అన్నది తెలియ దు. దాని మీద పడి నోటికి ఏది దొరికితే అది తింటుంది. అందుకే దీనిని అంధ గోక్షేత్ర న్యాయ ము అని అంటారు. దీనినే మనుషులకు వర్తిం ప చేసి చూద్దాం. ఇది వ్యక్తుల గుడ్డితనం గురించి చెప్పడం కాదు. వారు ఇలాంటి మన స్తత్వాన్ని కలిగి ఉంటారని తెలియ చెప్పడా నికి ఈ న్యాయాన్ని ఉదా#హరణగా చెబుతుం టారు. కొంతమంది తాము చేసేది మంచా చెడా? తప్పా! ఒప్పా? చేయొచ్చా? చేయ కూడదా.. ఇలా ఏదీ ఆలోచించరు. అలా నేరుగా వెళ్ళి ఎవరేమనుకున్నా తాను అను కున్నది చేస్తుంటారు. ఇందులో తన లాభ ము, సంతోషమే చూసుకుంటారు. జరిగే నష్టం గురించి ఆలోచించరు. ఇలా చేయడం మూర్ఖత్వమే కాకుండా తెలియనితనంగా వివేక శూన్యతగా కూడా చెప్పవచ్చు.
తినాలనే, కడుపు నింపుకోవాలనే ఆశ తప్ప మరొకటి వీరిలో మనకు కనిపించదు.
అందుకే వేమన అలాంటి వారిని గురించి ఇలా అంటారు-
”ఆశ చేత మనుజులాయువు గల వాళ్ళు
తిరుగుచుండ్రు భ్రమ త్రిప్ప లేక
మురికి భాండమందు ముసురు నీగల భంగి
విశ్వధాభిరామ వినుర వేమ!

మురికి కుండలో తిండికోసం ఈగలు ముసురు కొన్న ట్లు. ఆయుష్షు ఉన్నన్ని రోజులు అంటే బతికున్నంత కాలం ఇలాంటి ఆశతో తిరుగుతూ ఉంటారు. భ్రాంతిని వదలలేరు. ఇలా వ్యక్తులు జీవిత పరమార్థం మరిచి, ఏది సరైన జీవనం అనే విచక్షణ, వివేకం లేకుండా బతకడం కోసం తోచిందల్లా చేయడాన్ని అంధ గోక్షేత్ర న్యాయముగా చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement