Friday, November 22, 2024

నారద ముని సంతానం…

ఆబాల గోపాలానికీ తెలిసిన మునిపుంగవుడు నారదుడు. ఎల్లవేళలా నారాయణ నారాయణ అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు. సనాతన ధర్మ సంప్రదాయంలో మనిషి. మనీషిగా, మహాత్ము డుగా ఉన్నతిని అందుకొని ముముక్షువుగా పరమప దంచేరి మహర్షిగా దైవత్వాన్ని పొందుతాడు. ఆజన్మ బ్రహ్మచారి అయిన నారదుడు బ్రహ్మదేవుని మానస పుత్రుడు. విష్ణు భక్తుడు. పరమశివుని ప్రియశిష్యుడు. పధ్నాలుగు లోకాలను ఇచ్ఛామాత్రంగా చుట్టిరాగల బ్రహ్మర్షి. ఆధ్యాత్మిక సాధనలో ఆయనకు ఆయనే సాటి. ఎలాంటి సంసార సంబంధమైన సమస్యలు లేకుండా ఎంతో హాయిగా తిరిగే ఆయనకు ఓ రోజు విచిత్రమైన కోరిక కలిగింది. భూలోకంలో భవసాగరా న్ని దర్శించాలన్న ఆసక్తి కలిగి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. సంసారం మాయ అంటారు కదా! అదేంటో తెలుసుకోవాలని ఉందని తన కోరికను విష్ణుమూర్తికి తెలియజేస్తాడు. భూలోకంలో ఒక కొలను (కాకినాడ దగ్గర, సర్పవరం భావనారాయణ గుడి ఎదురుగా వున్న తటాకము) చూపించి అందులో స్నా నం చేసి రమ్మంటాడు మహావిష్ణు.
సరేనంటూ వెంటనే వెళ్ళి అందులో దిగి స్నానం చేసి వచ్చేసరికి, నారదుడు ఒక స్త్రీగా మారి, పూర్వజన్మ జ్ఞానాన్ని కోల్పోతాడు. అంతలో అటుగా వచ్చిన ఒక రాజు, స్త్రీ రూపంలో వున్న నారదుడిని చూసి మోహం చి ఆమెను వివాహము చేసుకుంటాడు. సంసార బం ధాల్లో చిక్కుకుంటాడు. వీరికి 60 మంది సంతానం కలుగుతా రు. కొన్నేళ్ళ తరువాత శత్రువులతో జరిగిన యుద్ధములో, రాజు తన 60 మంది పుత్రులతో సహా మరణిస్తారు. స్త్రీ రూపంలో వున్న నారదుడు అంతు లేని దు:ఖానికి గురవుతాడు. మరణించిన వారికి ఉత్తర క్రియలు జరిపించి తరువాత తాను పూర్వం స్నానం చేసిన కొలనులో స్నానం చేయడంతో, అతనికి స్త్రీ రూపం పోతుంది. అయి నాపుత్రులు యుద్ధంలో మరణిం చిన దు:ఖము నుంచి తేరు కోలేకపోతాడు.
అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఇదంతా తన మాయ వల్ల జరిగిందని చెపుతాడు. నారదుడి సంతానం పేరు శాశ్వ తంగా నిలిచి వుండేలా వారు పేర్లే కాలప్రమా ణాలుగా మారి, సంవత్సరం పేర్లుగా మారుతా యని వరమిచ్చాడు.
అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల , ప్రమోద, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర… ఇలా 60మంది పుత్రుల 60 మంది పేర్లే ఇప్పుడు మనం వుపయోగిస్తున్న సంవ త్సరం పేర్లుగా వ్యాప్తిలోకి వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement