ఒకసారి శ్యామా కళ్ళు బాగా వాచిపోయాయి. ఎన్నో మం దులు వాడాడు గానీ ప్రయోజనంలేదు. కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో మసీదుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ”బాబా నేనేం పాపం చేసానని నాకు ఈ కష్టం కలిగించావు? నాలుగు రోజుల నుండి కళ్ళు కనబడక బాధపడుతున్నా నీకు నాపై దయ రాలేదా?” అని అడిగాడు. అప్పుడు బాబా చిరున వ్వుతో ”శ్యామా, ఇంటికిపోయి ఏడు మిరియపు గింజలు తీ సుకొని నీటిలో నానేసి, దానితో నీ కళ్ళు శుభ్రం చేసుకో” అన్నా రు. శ్యామా మారుమా ట్లాడకుండా బాబా చెప్పినట్టే చేయగా రెండు రోజులలోనే ఆ బాధ తొలగింది.
ఇంకొక సందర్భంలో మసీదులో శ్యామాతో మాట్లాడు తూ వుండగా సాయి హఠాత్తుగా జేబులో వున్న ధనం అంతటినీ తీసి తాను కూర్చున్న గోనె పట్టాకింద దాచేసారు. అప్పుడే ఒక భ క్తుడు వచ్చి తనకు అత్యవసరంగా కొంత పైకం కావాలని దు: ఖించాడు. నా దగ్గర డబ్బు లేదని సాయి అతడిని పంపేసారు. అప్పుడు శ్యామా సాయితో ఎందుకు అబద్ధం చెప్పావని అడిగితే అతనికి డబ్బు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఒకవేళ నా దగ్గర డ బ్బు వుందని, అది ఇవ్వడం మంచిది కాదని నేను చెప్పినా అతని తల కెక్కదు. అందుకనే అబద్ధం చెప్పాల్సి వచ్చిందని సాయి వివరించారు. శ్రేయస్సు చేకూర్చే అబద్ధం నిజంతో సమానమని, హాని కలిగించే నిజం ప్రమాదకరమైనదని సాయి ఈవిధంగా మనకు పై లీల ద్వారా తెలియజేసారు.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూప దర్శనం ప్రసా దించినట్లే సాయి కూడా శ్యామాకు సత్యలోకం, కైలాసం, వైకుం ఠం చూపించారు. తన అవతార వైశిష్ట్యాన్ని చూపించే ఆధ్యాత్మి క ప్రపంచాన్ని కూడా చూపించి అతడిని ధన్యుడిని చేసారు.
ఒక దీపమును మరొక దీపముతో వెలిగించవచ్చును, రెం డు దీపములు ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా వెలుగుతు న్నట్లు మనకు అనిపిస్తుంది కానీ నిజానికి రెండింటి మధ్య విడదీ యరాని సంబంధం వుంది. రెండింటినీ మండించే ప్రాణ వా యువు ఒక్కటే. అట్లే భగవంతునికి భక్తునికీ మధ్య బేధ మేమీ లేదు. ఇద్దరూ పరమాత్మ స్వరూపాలే. ఈ సత్యాన్ని తెలియ జప్పేందుకే బాబా తరచుగా ”మన మధ్య నీ నా అనే అడ్డు గోడ ను కూల్చండి. అప్పుడు ఇద్దరం ఒక్కటేనన్న సత్యం మీకు అను భవమౌతుంది” అని అంటుండేవారు.
బాబా భక్తాగ్రేసరులైన కాకాసాహబ్ దీక్షిత్, బాపూసాహబ్ ధుమాల్, అన్నాసాహబ్ దాభోల్కర్ వంటివారు ఎటువంటి అ నారోగ్యం పాలవక సుఖమరణం పొందారు. శ్యామా కూడా అంతే. మరణానికి ముందు రాత్రి మాత్రం కోమాలో గడిపాడు. తాను తన సర్వస్వంగా భావించి, ప్రతీ ఊపిరిలో సాయి నామా న్ని నింపుకొని శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా సాగించిన జీవి తాన్ని అతను 26 ఏప్రిల్ 1940 తారీఖున ఎనభై సంవత్సరాల
రాల వయసులో ఆఖరు శ్వాస విడిచి సాయిలో ఐక్యం అయిపో యాడు. మర్నాడు శ్యామా ద#హన సంస్కారాలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయి భక్తులెందరో దేశం నలుమూ లల నుండి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.
బాబాకు భక్తులెందరో వున్నారు. కానీ బాబాకు శ్యా మాకు మధ్య గల సంబంధం అనిర్వచనీయమైనది. శ్యామా అమాయక మనసుతో తన సర్వస్వాన్ని బా బాకు అర్పించాడు. బాబాను తన జీవిత రథ సారధి గా చేసుకున్నాడు. మాటలలోకాక భక్తి, శ్రద్ధ, స బూరిలను (విశ్వాసంతో కూడిన ఓర్పు) ఆచరణ లో చూపించాడు. తాను జీవించిన ప్రతీ క్షణం బా బా నామస్మరణతోనే గడిపాడు. న వవిధ భక్తి మార్గాలను అనుసరించి అందరికీ ఆద ర్శ ప్రాయుడయ్యాడు. శ్రీకృష్ణుడు, అర్జు నుల మధ్యవున్న దైవనీయమైన సం బంధం మనకు శిరిడీలో ప్రత్యక్షంగా కనిపించింది. అనేకసార్లు సాయి తన హృదయంలో శ్యామాకు గల స్థా నాన్ని అందరికీ తెలియజేసారు. శ్యామా సాధించిన భక్తిలో ఒక శాతం మన సాధించగలిగినా అదృష్టవంతులమే.