Saturday, November 23, 2024

అనంతం శ్రీ కుండలేశ్వర క్షేత్ర మహత్యం

కోనసీమలోని ముమ్మిడివరం సమీప ప్రాంతంలో వృద్ధ గౌత మీ నదీ తీరంలో వెలిసిన క్షేత్రం కుండలేశ్వరం. సూర్యభగవానుని కుండల ము ఆకారంలో ఇక్కడ ఈశ్వర లింగాన్ని గౌతమ మహాముని ప్రతిష్టించారు. బ్రహ్మాండ పురాణం లో గౌతమి మహాత్మ్యంలో ఈ క్షేత్రము గూర్చి వ్యాస మహాముని 15వ శ్లోకములో 103వ అధ్యా యములో వర్ణించారు. బ్రహ్మదేవుడు నారద మహామునితో ఈ క్షేత్రం గురించి చెప్పినట్లుగా ఉంది. గౌతమముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహస్తూ సముద్రం కేసి గంభీరంగా వెళుతుం ది. ఆ సమయంలో సముద్ర ఘోషవిని కోపంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుడిని భేదించాలి అనుకుంది గోదావరి. ఈ ఆలోచనలు పసిగట్టిన సముద్రుడు కుండలాలను, పూజాద్ర వ్యాలను పళ్లెంలో ఉంచి గౌతమి నదికి ఎదురెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి గోదారమ్మ మొక్కి నా మీద కోపం వద్దు శాంతించి తన వేగాన్ని తగ్గించు కోమని కోరాడు. సూర్య భగవానుడి తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తానని, లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుదేవుడి అనుగ్రహంతో వీటిని పొందాడని తెలియజేసాడు. దీనితో గోదావరి శాంతించింది. సముద్రుని కోరిక మేరకు కుండలేశ్వర క్షేత్రంలో వీటిని దేవతల కొరకు వృద్ధ గౌతమీ నదిగర్భం లో ఆలయం, మానవుల కోసం గ్రామంలో ఒక కుండల లింగాన్ని గౌతమ మహాముని స్ధాపించా రని చెబుతారు. కాశీలోని గంగ నరులు చేసిన పాపాలను తనలో స్నానమాచరించి ప్రక్షాళన చేసుకుంటుంటే ఆ పాపాల నివారణకు హంస రూ పంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలోని వృద్ధ గౌత మీ నదిలో స్నానమాచరిస్తుందని ఇక్కడ పూర్వీకు లు విశ్వసిస్తారు. ఇప్పటికి అర్థరాత్రి వేళ క్షేత్రం సమీపంలోని నదిగర్భం నుండి ఓంకారనాదాలు, భజనలు వినిపిస్తాయని వారు చెబుతూ ఉంటారు.
కుండలేశ్వర క్షేత్రం గురించి శంకరాచార్య కృతకమైన చంద్రశేఖర అష్టకములో ఈ స్వామిని మార్కండేయులు ధ్యానించారు.
మంగళాష్టకములోని ఒక శ్లోకములో ”కుండలపతి” అని చెప్పబడుచు న్నది. 15వ శతాబ్దిలో శ్రీనాథ మహాకవి తన కాశీ ఖండము లోని భీమఖండములోను ఈ క్షేత్రమును వర్ణించి యున్నారు. ”విరూపాక్షుండు కుండలేశ్వరుం డు” అని కాశీఖండములోను, ”కోటీపల్లిశు కోమ లాంఘ్రులకు మ్రొక్కి కుండలాముఖ తీర్ధంబు గురించి గౌతమీ గంగ లవణాబ్ధి గౌగలించె” అని భీమ ఖండములో వర్ణించారంటే ఈ క్షేత్ర ప్రాశ స్త్యం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. ఈ ఆలయ గోపురంలో ఎక్కడా లేనివిధంగా 23 శివలీలల విగ్రహమూర్తులు కలవు. నది చెంతనే శ్రీ సుబ్రహ్మ ణశ్వర దేవాలయం, మహాగణపతి, కుమార స్వామి, కనకదుర్గమ్మ, ఆంజనేయ స్వామి ఆల యాలు నిర్మించారు.అన్ని ఆలయాలకంటే భిన్నంగా తరతరాలుగా పూజలు నిర్వహస్తున్న అర్చకులే ఆలయాన్ని అభివృద్ధి చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement