శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామికి చేసే పూజలలో అత్యంత ప్రా ధాన్యాన్ని సంతరించుకున్న పర్వదినం సుబ్రహ్మణ్య షష్టి. దీనిని స్కంద షష్టి అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సకల పాపాలు పోయి, కష్టాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సొంతమవుతాయని పురా ణాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి నెమలి వాహన మెక్కి భక్తుల కష్టాలను తీర్చేందుకు లోక సంచారం చేస్తాడని శివపురాణం చెబుతోంది. ఆ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయి. అవివాహతుల కు వివాహం అయ్యి, సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
పార్వతీపరమేశ్వరుల ముద్దుల తనయుడిగా పేర్గాంచిన సుబ్రహ్మణ్యశ్వ రుడు తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించినవాడు. తారకాసురుడు అమి త తపోబల సంపన్నుడు. బలశాలి. వర మదాంధుడు. బాలునితో తప్ప ఇతరుల తో తనకు చావు లేని విధంగా శివుని నుంచి వరం పొందినవాడు. దాంతో వర మదంతో తాను అజేయుడునని, అమరుడునని ముల్లోకాలను గజగజలాడిం చా డు. అతని అకృత్యాలకు తల్లడిల్లిపోయిన దేవతలు తారకాసురుడి అరాచకాల గురించి బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా, తారకాసురుడి మరణం ఈశ్వర తేజాంశ సంభవుని వల్లే అవుతుందని, కనుక ముందు సతీ వియోగ దు:ఖంతో ఉన్న ఈశ్వరుడికి, గిరిరాజు హమవంతుని పుత్రికగా అవతరించిన పార్వతీదేవికి వివాహం జరిపించమని, వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడవుతాడని చెబుతాడు.
బ్రహ్మ దేవుడి సూచన మేరకు, అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి మధ్య అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. శివపార్వతుల మధ్య అన్యో న్య వాతావరణాన్ని సృష్టించడానికి మన్మధుడు పూలబాణాలతో ఈశ్వరుని చలిం పచేసి, పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి కారణమవుతాడు. తాను ఈశ్వర ఆగ్ర హానికి గురై భస్మం అవుతాడు. అయితే ఆదిదంపతుల వివా హం అయిన తరువా త దేవతల అభ్యర్ధన మేరకు శివుడు తిరిగి మన్మధునికి పున ర్జీవితం కల్గిస్తాడు.
ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహంచిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశ పెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజాన్ని అగ్నిదేవుడు గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజం అదే సమయంలో నదిలో స్నానమాచరిస్తున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. అయితే ఆ రుద్రతేజాన్ని వారు భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు. అంతట ఆ తేజం ఆరు తేజస్సులతో ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడిగా ఆవిర్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమే శ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందువల్ల గాంగేయుడని, షట్‌కృత్తికలు అతనిని పెంచి పెద్దచేసిన కారణంవల్ల, ఆరు ముఖాలు కలిగిన వా డు అవ్వడంవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని గౌరీశంకరుల పుత్రుడవడం వల్ల కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అనే పేర్లతో విరాజిల్లాడు.
స్కందుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో కూడా పిలుచుకునే ఆ బాలుణ్ణి దేవతలు కోరిక మేరకు పార్వతి పరమేశ్వరులు దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. అనంతరం పరమేశ్వరుడు శూలం తదితర ఆయుధాలను అను గ్రహంచగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి ”శక్తి” అనే ఆయు ధాన్ని ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగి స్తారు. కార్యోణ్ముఖుడైన సుబ్రహ్మణ్యస్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి, ఆరు చేతులతో ధనస్సులను, మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి, ”సర్పరూపం” దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యు ద్ధంలో తారకాసురుని సంహరిస్తాడు. తారకాసురుడు అంతమొందడంతో దేవేంద్రుడు ఆనందంతో తన కుమార్తె దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవ సేనతో ”శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి”కి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఆ రోజు ను ”శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. అలాగే, తారకాసుర సంహారం జరి గిన రోజు కనుక స్కంద షష్టిగా కూడా వ్యవరిస్తున్నారు.
ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామిని భక్తితో పూజిస్తే స్వామి సర్వమూ అనుగ్రహస్తాడని పురాణోక్తి. ఈ పర్వదినం నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, నాగ పడగల రూపాలను స్వామికి సమర్పిస్తారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే.
అలాగే, సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామికి పూజ చేసినా, కావడి సమర్పిం చినా సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదో షాలు తొలగిపోతాయి. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరి పించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి. అలాగే స్కంద షష్టినాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం వీక్షించే భక్తుల ఆటంకాలు సైతం తొలగి వివాహాలు జరిగి, సత్సంతానం కలుగుతుందని విశ్వాసం.
ఇక తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్య షష్టి రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతో నూ, పాలతోనూ నింపుతారు. అయితే ఆయా వ్యక్తుల మొక్కుబడుల ననుసరిం చి ఆయా కుండలను ఆయా పదార్ధాలతో నింపడం చేస్తారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాలలో బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే సుబ్రహ్మణ్య షష్టి రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాం తాల్లో, షష్ఠి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజైన సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా సంప్రదాయంగా వస్తోంది. అలాగే, ఈ పర్వదినం నాడు ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని దీక్షగా పఠిస్తే సర్వ శుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఆ రోజున నాగ ప్రతిష్ట చేసినవారికి సంతానం కలు గుతుందనే నమ్మకం కూడా భక్తులలో ఉంది.
అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నిర్వహంచే వ్రతంలో సామాజిక ప్రయో జనం కూడా ఒకటి దాగి ఉంది. దానికి ఈ వ్రత విధానమే సమాధానంగా తోస్తుం ది. మార్గశిర మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. కనుక చలితో బాధ పడే వారికి ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు దానం చేసే సంప్రదాయాన్ని ఆ కార ణంగానే ఈ వ్రతంలో మన పెద్దలు చొప్పించారు. మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠిలాంటి వ్రతాలనూ చెయ్యా లని వ్రత గంథాలు చెబుతున్నాయి.
అనంత తేజో శక్తిస్వరూపుడు షణ్ముఖుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement