Tuesday, November 26, 2024

అనంత ఫల ప్రదాయకాలు…

కలి మానవులలోని మాలిన్యం నశించాలంటే కర్మ జరగాలి. విక్షేపాలు నశించా లంటే శ్యామసుందర రూపం దర్శించి, ప్రేమించాలి. ఆవరణలు తొలగాలంటే బీవేశ్వరుల యొక్క, మాయ యొక్క యదార్థ జ్ఞానాన్ని పొందాలి.
మనసులోని మాలిన్యం తొలగిపోనంతవరకు దానధర్మాలు, పూజలు, జపతపాలు సత్ఫలితాన్ని యివ్వలేవు. హిందూ జీవనంలో సంస్కారాలు సుచారు రూపంలో జీర్ణిం చుకొని యున్నాయి. ఏ యాగం గానీ, యోగం గానీ ఈ సంస్కార ప్రభావానికి ఏమాత్రం సరిరాదు. వీటిని కర్తవ్య భావంతో సకాలంలో సశాస్త్రీయంగా- ద్రవ్య విషయంలో యధా శక్తిగా నిర్వర్తించి తీరాలి. అలా జరగకపోతే ఆ జీవికి ఆధ్యాత్మిక అభ్యుదయంగానీ, లౌకి కంగా అభ్యుదయంగాని వుండవు. లభించవు. ఇది త్రికాల సత్యం.
సంస్కరణ అంటే దోషాలను పరిహరించడం. మనోవాక్కాయములలో ఉన్న దోషా లను పోగొట్టి వానిని సంస్కారాలంటారు. తద్వారా దోషాలు తొలగి, సద్గుణాలు అంకురి స్తాయి. హీనమైన అంగాలు పరిపూర్ణమౌతాయి. స్థానం- ద్రవ్యం- భావం- వ్యక్తి విషయా లననుసరించి ఈ సంస్కారాలు ఎంతో ఉన్నతమయి అనంత ఫలప్రదాయకాలవుతాయి.
కుటుంబములో ఉపనయనం వరకు తండ్రి చేసే సంస్కారాల ప్రభావం పుత్రునిపై వుంటుంది. ఉపనయనం కాగానే పురుషుడు కర్మాధికారాన్ని పొంది, పాపపుణ్య ఫల భాగి అవుతున్నాడు. ఉపనయనం లేని పుత్రులు- వివాహంకాని స్త్రీలు కర్మాధికార శూన్యులు. వారికి ఇహపరాలు రెండూ దు:ఖమయమవుతాయి. మనసులోని మాలిన్యం క్షయం అవడం ద్వారా జ్ఞాన నేత్రం ప్రసాదించే అద్భుత ప్రక్రియ ఉపనయనం. అది జీవు ని భగవత్‌ సాన్నిధ్యమునకు నడిపిస్తుంది. భగవంతుడు యజ్ఞోపవీత రూపంలో పురు షునీ, మంగళసూత్ర రూపంలో స్త్రీని సదా శక్తిని దానం చేస్తూ అనుగ్రహిస్తున్నాడు. సకల వర్ణాల వారు త్రికాలములలో భగవత్‌ ప్రార్థన చేస్తూ వుండాలి. అదే వారికి గాయత్రీ మంత్ర సదృశమై వారందరినీ సుసంస్కృతుల్ని చేస్తుంది. ఈ సంస్కారాలన్నింటి వలన సిద్ధించే ప్రయోజనమును ఇతరులు భగవధ్యానం, సత్‌ప్రవర్తనల వలననే పొందగల్గు తున్నారు. ఈ సంస్కారాలు స్థూల- సూక్ష్మ- కారణ శరీరాలను శుద్ధి చేసి భగవత్‌ కృపకు మానవులను యోగ్యులుగా చేస్తున్నాయి. పాపకర్మల ప్రాబల్యాన్ని మానవుడు అర్థం చేసు కోలేకపోతున్నాడు. దైవభావనలోకి ప్రవేశించాలంటే సంస్కారాలను విధిగా ఆచరిం చాలి. సేవించి తీరాలి. మానవులు సుఖించాలంటే కర్మలు చేసి తీరాలని గీతలో నాల్గవ అధ్యాయంలో భగవానుడు ”క్షిప్రం హిమానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా” అన్నాడు.
పంచ మహాయజ్ఞాలైన దేవ ఋషి- పితృ- భూత- మనుష్య యజ్ఞాలను బ్రాహ్మణ క్షత్రియ- వైశ్యులకు యివి వేదమంత్రాత్మకాలు. ఇతర వర్ణాలవారు వేదమంత్రాలు లేకుం డా ఈ యజ్ఞాలను ఆచరించి తీరాలి.
‘ఋణాని త్రాణ్య ప్రాకృత్య- మనో మోక్షే నివేశయత్‌” అని శాస్త్రం. దేవర్షి, పితృ ఋణాల్ని తీర్చుకొన్న తరువాతనే మనసును మోక్ష ప్రయత్నంలో వినియోగించాలని భావం. మనం తినే ఆహారాన్ని ముందుగా భగవంతునికి నివేదించి తినడం వలన దేవ ఋణం తీరుతుంది. ఇంద్రియాలు గ్రహించే ఆయా విషయాలు ధర్మబద్ధంగా వుంటే అవి చక్కగా వృద్ధి అవుతాయి. అప్పుడే యింద్రియాలలో వుండే దేవతలు ప్రసన్నులౌతారు. చివరకు సమస్త ఇంద్రియ కర్మల్నీ అంతర్ముఖంచేసి, ఆత్మలో లీనం చేస్తారు. త్యాగం చేయడాన్నే ‘యజ్ఞం’ అంఆరు. ఒకే ఆత్మతత్త్వం అందరిలో వుంది. జ్ఞానంతో కూడిన ఈ త్యాగమే యజ్ఞమై శాంతమనే అమృతాన్ని ప్రసాదిస్తుంది. తుదకు జీవితం ప్రసాద రూపం అవుతుంది. ఊర్థ్వ లోకాలలో వుంటే పితరులు భూలోకంలో తమ వంశస్థులు సమస్త సుఖసంపన్నులుగా వుండాలని కోరుకుంటారు. అంతటి వాత్సల్యమయులకు ఆహారం అందించడం మానవ ధర్మం. సంవత్సరానికొక్కసారి శ్రాద్ధం జరిపితే చాలు పితరులు రోజూ ఆహారాన్ని పొందగల్గుతారు. దేవతలు ఆశీర్వదిస్తారు.
ఋషులు మంత్ర ద్రష్టలయి, మానవుల మేధాశక్తిని క్షణక్షణం వృద్ధి చేస్తున్నారు. అలాంటి ఋషుల ఋణం తీర్చుకోవాలంటే వారందించిన వేదశాస్త్రాలను అధ్యయనం చేయాలి. చేయించాలి. ఇలా దేవర్షి పితృ భూత మనుష్య గణాల్ని సంతృప్తులను చేసే అద్భు త విధానాలే పంచ మహాయజ్ఞాలు. దివ్యమైన సంస్కారాలు మానవ జీవితమంటే వారి దివ్య ఆశీర్వచనం యొక్క ఫలమే. సంస్కారాలు మానవ జీవితాలను చక్కగా నియమ బద్ధం చేసి భగవద్రాజ్యంలోకి ప్రవేశింపజేస్తాయి. లోకానికే అది జీవనదాయకం. ఫలప్ర దాయకం. ఐశ్వర్యదాయం.
– పి.వి.సీతారామమూర్తి, 9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement