సత్యసాయి విద్యాలయాలలో మామూ లు విద్యతో పాటు-, మనిషి మనీషిగా మారేం దుకు అవసరమైన మహోన్నత విద్యను కూ డా అందిస్తారు. ‘నా విద్యార్థులే నా నిజమైన ఆస్తి’ అనేవారు బాబా. విద్యార్థులకు బాబా ఎం తో ప్రాధాన్యత యిచ్చేవారు.
ఓ పర్యాయం స్వామి విద్యార్థులతో మా ట్లాడుతున్నారు. తాను చెప్పదలచుకున్నది చెప్పుకుంటూ పోయే పద్ధతికి భిన్నంగా, చెబు తున్న విషయాన్ని మద్యలో ఆపి, మధ్యలో విద్యార్థులను ప్రశ్నలు అడుగుతుంటారు స్వా మి. చెబుతున్న విషయం అర్ధమవుతోందో లేదో తెలుసుకోవడానికి స్వామి ఆచరించే పద్ధ తి అది.గాఢత బాగా ఉన్న లోతైన విషయా న్ని చెబుతున్న స్వామి చెప్ప టం ఆపి ఓ విద్యార్థిని ”ఒక టికి ఒకటి కలిస్తే ఎంత బంగారూ?” అడి గారు. ప్రతి ఒక్కరినీ బంగారూ అని సంబోధిం చడం స్వా మి అలవాటు-.
ఏమాత్రం తడుముకోకుండా రెండు అని సమాధాన మిచ్చేడా విద్యార్థి. మిగిలిన విద్యా ర్థులను కూడా స్వామి అడిగారు. అందరూ మూకుమ్మడిగా రెండు అనే వంత పాడారు. ”ఆహా! అలాగా బంగారూ! మీ సమాధానాలు శుద్ధ తప్పు. ఒకటికి ఒకటి కలిస్తే, మీరన్నట్లు- రెండు అయితే అది గణితం. ఒకటికి ఒకటి కలిస్తే, ఒకటే అయితే అది ఆధ్యాత్మికం” అని చెప్పారు స్వామి. విద్యార్థులకు అర్ధంకాలేదు. అప్పుడు స్వామి ”అవును బం గారూ! జీవాత్మ పరమాత్మలో కలిస్తే పరమాత్మే కదా” అన్నా రు. ఆనందంతో విద్యార్థులు చప్పట్లు- కొట్టారు.
అవును! ఉన్నది ఒక్కటే. రెండోది లేదు. ఆధ్యాత్మికం లెక్కవేరు. అది భౌతికానికి అంద దు. మరో పర్యాయం స్వామి విద్యార్థులతో సంభాషిస్తున్నారు. విషయాలను విద్యార్థులు అడుగుతున్నారు. స్వామి ప్రశ్నల న్నిటికీ చాలా ఓపికగా, విద్యార్థులందరికీ అర్ధమైన రీతిలో వివరిస్తున్నారు. ఆ వివరణ చమ త్కారాలతో, జోకులతో అవసరమైనచోట కొంచెం కటు-వు గా, యింకా అవసరమైనచోట మందలింపు తో, తెచ్చుకున్న ఆగ్రహంతోనూ సాగుతోంది.
ఇంతలో ఓ విద్యార్థి లేచి నిల్చుని స్వామీ! నన్నో సందేహం ఎన్నో రోజుల నుండి పట్టి పీడి స్తోంది. తీరుస్తారా స్వామీ? అని అడిగాడు. ”ఆలస్యం ఎందుకు అడుగు”. అన్నారు స్వామి. అడగడానికి ఆ విద్యార్థి భయపడుతు న్నా డు. ”భయం వద్దు. అడగాలనుకున్నది అడిగేయ్.” అన్నారు. ”అడిగిన తర్వాత నాది తప్పైనా ఏమీ అనకూడదు స్వామీ!” అని అన్నాడు విద్యార్థి.”పర్వాలేదు అడుగు” అన్నా రు స్వామి. స్వామి నుంచి హామీ వచ్చేక ధైర్యం గా ”స్వామీ! అందరూ అనుకునేటట్లు- మీరు భగవంతుడేనా?” అని అడిగాడా విద్యార్థి. ”ఇంత గొప్ప డౌటు- నీకెందుకు వచ్చింది?” అన్నారు. ”స్వామీ! తప్పైతే మన్నించండి. అందుకే అడగడానికి ముందే, తప్పైతే ఏమీ అనకూడదని మిమ్మల్ని అడిగాను. భయంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసేడా విద్యార్థి. అప్పుడు స్వామి ఎంతో ప్రశాంతంగా…
”అవును బంగారూ. ఏమాత్రం సందే హం అక్కర్లేదు. నేను భగవంతుడినే. నిజానికి నేనే కాదు నువ్వూ భగవంతుడివే!” నవ్వుతూ సమాధానమిచ్చారు స్వామి. కంగుతిన్నాడా విద్యార్థి. అతను బాగా తెలివైనవాడు. ధైర్యం గా ”నేను కూడా భగవంతుడినేనా స్వామీ? అయితే, ఈ భజనలు నాకెందుకు? పూజలెం దుకు? వ్రతాలెందుకు?”అడిగాడు విద్యార్థి.
స్వామి ”నేను భగవంతుడిని అని నాకు తెలుసు. నువ్వు భగవంతుడువి అని నీకు తెలీ దు. అదే మనిద్దరికీ తేడా. నువ్వు భగవంతుడ వని తెలుసుకునేందుకు నువ్వు చేయవలసిన సాధనా మార్గంలో, నీకు ఉపయోగపడే సాధ నాలు నువ్విప్పుడు చెప్పినవన్నీ. నువ్వు భగ వంతుడువి అని నీకు తెలిసిన తర్వాత, భజన లు, అర్చనలు వగైరా నువ్వన్నవన్నీ అవసరం లేనివే” అని చెప్పారు స్వామి.
ఎంతో ఆధ్యాత్మిక లోతులున్న, గాఢత గలిగిన సందేశమది. పై రెండు సంఘ టనలూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనా తత్వా న్ని, విశిష్టతను, ప్రత్యేకతనూ తెలియజేసే మెచ్చుతునకలు. సత్యం, ధర్మం, శాంతి, ప్రే మ, అహింసలకు మానవాకారం వస్తే, ఆ ఆకా రం సత్యసాయి అని బాబా భక్తుల భావన. జీవి తంలో తాను ఆచరించి, తానాచరించినవే యితరులను ఆచరించమని చెప్పేవారు బాబా. తానాచరించినదే తన సందేశంగా అందించా రు బాబా. నా జీవితమే నా సందేశం. అని పదే పదే చెప్పేవారు. మన జీవితాలలో ఆచరించి నదే బాబా యిచ్చిన సందేశం అయ్యేలా మనం జీవించాలనే అర్ధం వచ్చేలా, తన సందేశాన్ని తర్వాత కాలంలో ‘నీ జీవితమే నా సందేశం’. అని మార్పుచేసి మనకు అద్భుతమైన అమృ తమయ సందేశమిచ్చారు సత్యసాయి బాబా.
- రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669