Tuesday, November 26, 2024

సదా స్మరణీయులు…నడిచే దేవుడు

దైవం మానుష రూపేణ అంటుంటారు. అంటే ఆత్మజ్ఞానం పొంది, దైవత్వాన్ని సిద్ధింపచేసుకొన్నవారు, మనుషుల మధ్య నడయాడుతూ, సనాతన ధర్మా న్ని, భారతీయ సాంప్రదాయాన్ని బోధిస్తూ, ప్రజలలో భక్తి, జ్ఞాన తత్త్వాలను విశదప రుస్తారు. అటువంటి కోవకే చెందిన శ్రీ రామకృష్ణ పరమహంస, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వంటి ఎందరో మహానుభావులు జన్మించిన వేద భూమి మనది. అటువంటి మహనీయుడు, నడిచే దేవుడుగా పేరు పొందిన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి జయంతి ఈ రోజు. అంటే ఆయ న 1894 సం.రం. మే నెల 20వ తేదీన తమిళనాడులోని వేలూరు (విల్లుపురం) గ్రామంలో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్య శాస్త్రి, మహాలక్ష్మి దంపతు లకు జన్మించారు. వీరికి ‘స్వామినాథన్‌’ అని నామకరణం చేశారు. 1905 సం.రం.లో అంటే పది సంవత్సరాల వయస్సులోనే ఉపనయన సంస్కారం చేసారు.
చిన్నప్పటి నుంచి ఆయనకు భక్తి అంటే అమితమైన ప్రేమ. ఒకసారి తమిళనాడులోని ఆర్కాటు జిల్లా కేంద్రంలో కంచి కామకోటి పీఠా ధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు చాతుర్మాస్య వ్రతం నిర్వహస్తున్నారు. ఆ సందర్భంలో స్వామినాథన్‌ను వెంట పెట్టుకుని తండ్రి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వెళ్ళిన సందర్భంలో, ఆ కంచి కామకోటి పీఠాధిపతి వారిని ఆకర్షించారు స్వామినాథన్‌. వెంటనే ఆయన సూచన మేరకు కుంభకోణం పండితు లు వద్ద రెండు సంవత్సరాల వేద వేదాంగాలు నేర్చుకొన్నారు.
తండ్రి ఈయన్ను పెద్ద ప్రభుత్వ అధికారిగా చేయా లనే తలంపుతో ఉన్నారు. అందుకు తన దూరపు బంధువు వెంకట్రామయ్య అనే జ్యోతిష్య పండితులకు అబ్బాయి జాతకం చూపించారు. ఆయన బాగా పరిశీలించి, ”ఆ అబ్బాయిని కాళ్ళు కడుక్కు రమ్మని” చెప్పారు. లోపలకు వచ్చిన ఆ బాలుడి పాదాలకు సదరు వెంకట్రామయ్య గారు పాదాభివందనం చేస్తూంటే అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. తండ్రి ”మీరు జాతకం చూసి చెపు తారనుకొంటే, ఏకంగా సాష్టాంగ నమస్కారం చేసారే మిటి?” అని అడిగితే, ”ఈ లోకమంతా ఆయన పాదా లనే ఆశ్రయిస్తుంది. పాదాలలో శంఖు చక్రాలను చూడండి.” అంటూ విశిదపరచారు. 67లో పీఠా ధిపతిగా ఉన్న శ్రీశ్రీ మహదేవేంద్ర సరస్వతీ మహాస్వామి వారు, పీఠాన్ని అధిరోహంచిన తరువాత కేవలం ఎనిమిది రోజులకే ఆయనకు సన్నిపాత జ్వరం, మసూచి శోకి మరణశయ్యపై ఉండగా, శ్రీశ్రీ స్వామి నాథన్‌గారికి ఆశ్రమాధికారుల నుండి పిలుపు రావడం, ఆశ్రమ అధికారులు వెంట పెట్టుకుని వెళ్ళి పీఠాధిపతిని చేసారు. అప్పటికి ఆయన వయస్సు 13 సం.రాలు. ఇంకా తోటివారితో ఆడుకొనే వయసులో, పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
పీఠాధిపతిగా…

కంచి కామకోటి పీఠానికి 68లో పీఠాధిపతిగా అధిరోహంచిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు వేద రక్షకుడు. సద్గురువు. శాస్త్ర పరిశోధ కుడు. దేశకాల పరిస్థితులను బట్టి, ఆధ్యాత్మిక సంపదను రక్షించే రాజనీతి జ్ఞుడు. అంతకుమించి బహుభాషా కోవి దుడు. తమిళం, తెలుగు, కన్నడ, హం దీ, ఆంగ్లం, బెంగాలీ భాషలలో మాట్లా డగలరు. ”ధర్మాచరణకు శ్రద్ధ అవసర మని- సంకల్ప బలం, విశ్వాసం ఉండా లని, మనసును నియం త్రిస్తేనే కార్య సిద్ధి కలుగుతుందని చెప్పేవారు. అంతేకా కుండా ”మన లోపాలను సం స్కరించుకోలేని పక్షంలో లోక క్షేమానికి యత్నించే అధికారం మనకు లేదు.” అని. అంటే ముందుగా మనకి మనం విశ్లేషణ చేసుకొంటూ ధర్మంగా జీవించాలని. ఆయన ఇంకా చెపుతూ ”శాస్త్రాల్లో చెప్పిన రీతిలో కర్మలను ఆచరించవలసి ఉంటుం ది. ఇది అవసరమా? అనవసరమా?’ ‘ అన్న ప్రశ్నకు తావు లేదు. నిత్య కర్మానుష్ఠానం క్రమం తప్పకుండా చేస్తూండాలి. అప్పుడే మనలోని రాగ ద్వేషాలు క్షీణించి, చిత్తశుద్ధి ఏర్పడి, మనసు సమాహతమై, ఈశ్వర సంధానమవు తుంది అని చెప్పారు. 1942 ప్రాంతాల్లో భారత రాజ్యాంగం రచనకు నాంది పలుకు తున్నరోజుల్లో, రాజ్యాంగంలో హందూ మత సంరక్షణ కల్పించడానికి కృషి చేసారు.

నడిచే దేవుడు లీలలు

ఒక సందర్భంలో సంగీత విదుషీమణి యం.యస్‌ సుబ్బలక్ష్మి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే, స్వామి అప్పటి తి.తి. దేవస్థానం కార్య నిర్వహణాధికారి ప్రసాద్‌గారికి లేఖరాసి, ఆమె సంగీత సాహత్యము లను ఉపయోగించుకొని, ఆర్థిక స్వావలంబన ఏర్పాటు చేయమని సూచించారు. అదే సమయానికి పుట్టపర్తి సాయి బాబా కూడా ఇటువంటి లేఖే రాశారు. అప్పుడే ఆమెను దేవ స్థానం ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.
ఒకసారి స్వామి గుంటూరు జిల్లా చందోలు గ్రామంలో ఉన్న తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రిగారి వద్దకు వెళ్ళిన సందర్భంలో, ఆయన తండ్రి తాడేపల్లి వెంకటప్పయ్య గారు రాసిన ”శ్రీ రామ కథామృతము” వింటున్నప్పుడు పరిచారకుడు వచ్చి ”స్వామీ! బెంగుళూరు నుండి ఒక వాణిజ్యవేత్త ఆశ్రమానికి ఆర్థిక సహాయం చెయ్యడానికి వచ్చారు. మీ దర్శనం చేసుకుని, మీకు ఇవ్వాలని” అం టే, ”కూర్చోమను” అని చెప్పారు. అయినా ఆ వ్యాపార వేత్త కంగారుపెడితే, ఆ పరిచారకుడు ఒక టికి రెండుసార్లు వచ్చి స్వామికి చెప్పగానే ”ఆయన డబ్బు తెచ్చాడని అతని కి దర్శనం కలిగించాలా? నాకు రామాయణం వినడం కన్నా, ఆ సొమ్ము గొప్పది కాదు. ఆశ్రమానికి విరాళం ఇవ్వాలనుకొంటే, కొంచెంసేపు ఆగమను” అన్నారు.
స్వామి కంచి పొలిమేరల్లో ఉన్న శివస్థానంలో మకాం ఉండగా మద్రాసు నుంచి ఒక భక్తుడు వచ్చి పాదాభివందనం చేసి, ”తన కుమార్తె వివాహం కుదిరిందని, వరుడు తరపు వారు 13 కాసుల బంగారం పెట్టమని అడుగుతున్నారు. నేనా పేద బ్రాహ్మణుడుని. మీరే మార్గం చూపించాలంటూ వేడుకొన్నాడు.” నేనా సన్యాసిని. నాకు బంగారంతో పనేముంటుంది? ఊళ్ళోకి పోయి (కంచికి పోయి కామాక్షి తల్లిని) అమ్మకు నీ గోడు చెప్పుకో! కరుణిస్తుందని” అని చెప్పి పంపారు. ఆ పేద బ్రాహ్మణుడు వెళ్ళిన తరువాత, బొంబాయి నుండి ఒక ధనికుడు స్వామి దర్శ నం చేసుకుని ఒక పొట్లం ఆయన కాళ్ళ దగ్గర పెట్టి ”ఉంచండి” అనగానే ”ఏమిటి అది” అని అడిగితే, బంగారం అని చెప్పారు. అపుడు స్వామి ”నాకు బంగారంతో పనేమిలేదు. తీసుకెళ్ళండి” అన్నా ఆయన వదిలేసి ”మీరే సద్వినియోగం చేయండి” అన్నారు. ఇంతలో కామాక్షమ్మకు తన మొర వినిపించి ఆ పేద బ్రాహ్మ ణుడు తిరిగి వచ్చాడు. ”పొట్లం చూపించి ఇందులో ఏముందో చూడు” అన్నారు. ఆ బ్రాహ్మణుడు పొట్లం విప్పి చూడగా సరిగ్గా 13 కాసుల బంగారం ఉంది. అపుడు స్వామి ”ఇంకేం! అమ్మ నీ మొర ఆలకించింది. నీకు కావలసిందీ 13 కాసులే. పట్టుకు వెళ్ళి, అమ్మాయి వివాహం జరిపించం డి” అని ఆశీర్వదించి పంపారు. దేశం నలుమూలల తిరిగి ధర్మబోధ, వేదసంరక్షణ చేస్తూ ఎంతోమందిని ఆధ్యాత్మికవైపు ఆకర్షించేలా చేసారు. ఆయన నిండు నూరేళ్ళు జీవించి తన 100వ ఏట అంటే 1994 జనవరి 8 తేదీని శివైక్యం చెందారు. ”అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపేణం శ్రీ ఖర గురుం ప్రచంద్రశేణమామి ముదావహం!!” అంటూ అంజలి ఘటిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement