Thursday, October 31, 2024

దారులన్నీ కొండగట్టు వైపే

కరీంనగర్‌, ప్రభ న్యూస్‌ : ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు- శ్రీ అంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారం భమైనాయి, ఈ నెల 18 వరకు ఉత్స వాలు జరుగనున్నాయి. ఈ నెల 16న చిన్న హనుమన్‌ జయంతికి భక్తులు పోటెత్తనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రతోపాటు- రాష్ట్ర నలు మూలల నుంచి లక్షలాది మంది భక్తులు, దీక్షాపరులు తరలిరానున్నారు. భ క్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధి కారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావడంతో ప్రధానాలయం ఆవరణ తోపాటు- గుట్టపై ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేశారు. టికెట్‌ కౌంటర్లు, స్వామి వారి దర్శనానికి క్యూ లైన్లు, బారికేడ్లను నిర్మించారు. మాల విరమణ మం డపం ఎదుట భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆరు సెల్లార్లు నిర్మించారు. వీఐపీల దర్శనం కోసం ఆలయ వెనక ద్వారం నుంచి ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు- చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే స్వామివారికి రెండు జయంతుల నిర్వహణ ఆనవాయితీగా వస్తుండగా, భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేకాలు, అర్చనలు మాత్రమే కొనసా గనున్నాయి. శ్రీ చాత్తాద శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం జయంతి ఉత్స వాలను జరుపుతారు. ఉత్సవాల సందర్భంగా జగిత్యాల ఎస్పీ సింధూశర్మ 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు- చేశారు. జగిత్యాల డీఎస్పీతో పాటు- అదనంగా మరో ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, 125 హోంగార్డులు కొండగట్టు-లో బందోబస్తు నిర్వహించ నున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవాలయం తరపున ఆలయం లోపల, ఆలయానికి వెలుపల అమర్చిన 23 సీసీ కెమెరాలకు అదనంగా 50 సీసీ కెమెరాలను అమర్చారు. పోలీస్‌ ఔట్‌ పోస్టులో కంట్రోల్‌ రూంను ఏర్పాటు- చేసి, సీసీ కెమెరాలను అను సంధానం చేశారు. ఆలయంతోపాటు- పోలీస్‌ ఔట్‌ పోస్టు వద్ద డిజిటల్‌ వీడియో రికా ర్డర్‌ (డీవీఆర్‌) లను ఏర్పాటు- చేశారు. సందర్భంగా హనుమాన్‌ దీక్ష దారులు కొంగ ట్టులో బస చేస్తారు కనుక ఇబ్బందులు కలగకుండా పది జనరేటర్లను సిద్ధంగా ఉంచారు. వై జంక్షన్‌ నుంచి నాచుపెల్లి మార్గంలోని బొజ్జపోతన్న వరకు శాశ్వతంగా ఎల్‌ఈడీ లైట్లను, 8 లక్షలు వెచ్చించి ఆలయం చుట్టూ అద్దె ప్రాతిపాదికన సోలార్‌ లైట్లను అమర్చారు. 30 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు- చేశారు. ఈసారి ప్రత్యేకంగా శుద్ధి చేసిన జలాలతో ఐదు మొబైల్‌ చలి వేంద్రాలను ఏర్పాటు- చేశారు. గుట్ట మీద ఉన్న ఐదు సులభ్‌ కాంప్లెక్స్‌లతోపాటు- 75 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. నూతన పుష్కరిణి వద్ద మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులను నిర్మించారు. ఘాట్‌ రోడ్డుతోపాటు- నాచుపెల్లి దారులపై ట్యాంకర్లు ఉంచి జల్లు స్నానాలకు ఏర్పాట్లు- చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement